E-Paper
Advertisement

టాటా నెక్సాన్ EVకి కొత్త పోటీ.. 370 కి.మీ రేంజ్‌తో విన్‌ఫాస్ట్ VF5 వచ్చేస్తోంది!

టాటా నెక్సాన్ EVకి కొత్త పోటీ.. 370 కి.మీ రేంజ్‌తో విన్‌ఫాస్ట్ VF5 వచ్చేస్తోంది!
Advertisement

VinFast VF5 Facelift Unveiled: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) తన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు VF5 ఫేస్‌లిఫ్ట్‌ ను అధికారికంగా ఆవిష్కరించింది. కొత్త డిజైన్, ఆధునిక ఇంటీరియర్, పెద్ద బ్యాటరీ ప్యాక్‌ తో ఈ కారును అప్‌ డేట్ చేసింది. ఇప్పటికే దేశంలో పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ మోడల్ త్వరలోనే దేశీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ విడుదలైతే టాటా నెక్సాన్ EV లాంటి కార్లకు పోటీగా నిలవనుంది.

SUV తరహా డిజైన్‌తో కొత్త VF5

పాత మోడల్‌ తో పోలిస్తే కొత్త VF5 డిజైన్‌లో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. బాక్సీ డిజైన్ లో ఉండేలా దీన్ని రూపొందించారు. కొత్త మోడల్ పొడవు 3,987 మి.మీ, వెడల్పు 1,772 మి.మీ, ఎత్తు 1,595 మి.మీగా ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే పొడవు 20 మి.మీ, వెడల్పు 49 మి.మీ, ఎత్తు 16 మి.మీ పెరిగాయి. వీల్‌బేస్ మాత్రం 2,514 మి.మీ దగ్గర యథాతథంగా ఉంది.

Advertisement

ముందు భాగంలో క్రోమ్ డిజైన్‌కు మరింత ఇంపార్టెన్స్ ఇచ్చారు. బంపర్‌పై అమర్చిన హెడ్‌ల్యాంప్స్, నిలువుగా ఉండే ఎయిర్ ఇన్‌టేక్‌లు కొత్త రూపాన్ని తీసుకొచ్చాయి. సైడ్ ప్రొఫైల్‌లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్ ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక భాగంలో పూర్తి వెడల్పుతో ఉండే LED లైట్ బార్, పెద్ద రూఫ్ స్పాయిలర్ ప్రత్యేకంగా కనిపిస్తాయి.

10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో కొత్త ఇంటీరియర్

కారు లోపలి భాగంలో కూడా విన్‌ఫాస్ట్ కీలక మార్పులు చేసింది. పాత డాష్‌బోర్డ్ స్థానంలో సింపుల్, లేటెస్ట్ డిజైన్‌ను తీసుకొచ్చింది. గతంలో 8 అంగుళాలుగా ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను ఇప్పుడు 10 అంగుళాలకు పెంచింది. కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను అందించింది.  స్పెషల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను తొలగించింది. స్పీడ్ సహా డ్రైవింగ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని మెయిన్ టచ్‌స్క్రీన్‌లోనే చూపించేలా ఏర్పాటు చేసింది. వైర్‌ లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కప్‌హోల్డర్లు, స్లైడింగ్ ఆర్మ్‌ రెస్ట్, డ్యూయల్ టోన్ లెదరెట్ సీట్లు కూడా ఉన్నాయి.

43kWh బ్యాటరీ.. 370 కి.మీ రేంజ్..

Advertisement

కొత్త VF5లో అతిపెద్ద అప్‌డేట్ బ్యాటరీ. పాత మోడల్‌లోని 29.6kWh, 37.23kWh బ్యాటరీల స్థానంలో ఇప్పుడు 43kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 370 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇందులో ముందు భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 99hp పవర్, 135Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6.6kW AC ఛార్జింగ్‌తో పాటు 60kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. అయితే, ఛార్జింగ్‌కు పట్టే సమయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

భారత్‌లో ఎప్పుడు విడుదల?

విన్‌ఫాస్ట్ VF5 ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో కంపెనీకి ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారుగా నిలవనుంది. ఇప్పటికే ఈ కారు భారత్‌లో పరీక్షల సమయంలో కనిపించడంతో త్వరలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ధర, లాంచ్ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దేశీయ మార్కెట్లోకి వస్తే టాటా నెక్సాన్ EV లాంటి మోడళ్లతో పోటీ పడనుంది.

Read Also: పెట్రోల్, డీజిల్ కాదు.. కంప్లీట్ ఎలక్ట్రిక్ డిఫెండర్ వచ్చేస్తోంది!

Tags

Related News

మార్కెట్లోకి వచ్చిన 6 నెలల్లోనే ఔట్.. పల్సర్ 180 మళ్లీ దొరకదా?

పెట్రోల్, డీజిల్ కాదు.. కంప్లీట్ ఎలక్ట్రిక్ డిఫెండర్ వచ్చేస్తోంది!

ఇండియాలోకి నార్టన్ న్యూ బైక్.. 585cc ఇంజిన్‌తో రాబోతున్నఅట్లాస్!

Kia Syros EV Range: కంపెనీ చెప్పేది 526 కి.మీ.. రియల్ టెస్ట్‌ లో వచ్చింది ఎంతంటే?

వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. ఇప్పుడు ఎంత అంటే?

కారు కీని గుర్తించడం లేదా? బ్యాటరీ అయిపోయినా ఇలా స్టార్ట్ చేయొచ్చు!

LFP vs NMC బ్యాటరీలు.. ఇండియన్ ఈవీలకు ఏది బెస్ట్? అసలు తేడాలు ఇవే!

Big Stories

Advertisement
×