Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో బిజీ అయిపోవడం వలన సినిమాలు మీద ఆయన దృష్టి పెట్టడం తగ్గించారు. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయారు కానీ సినిమా ప్రమోషన్స్ లో బాగా పాల్గొన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమాని కూడా ఇంతలా ప్రమోట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ప్రమోషన్ చూసి చాలామందికి ఆశ్చర్యం కలిగింది.
పవన్ కళ్యాణ్ పదే పదే ఈ సినిమా గురించి చెప్పడం వలన ప్రేక్షకులు అందరూ విపరీతమైన అంచనాలతో సినిమా థియేటర్ కు వెళ్లిపోయారు. ఎన్నో అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్ లో నిరాశ మిగిలింది. చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయిపోయారు. ఇక ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓజి అనే సినిమాలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.
కాంపిటీషన్ కాదు సెలబ్రేషన్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో మంచి అంచనాలు ఉన్నది మాత్రం ఓజి. ఆఖరికి పవన్ కళ్యాణ్ అభిమానులు హరిహర వీరమల్లు సినిమా ఈవెంట్ లో కూడా ఓజి ఓజి అని అరవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈ సినిమా మీద విపరీతంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమా నుంచి అప్డేట్ రానుంది. అయితే కేవలం ఈ సినిమా నుంచి మాత్రమే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా ఒక పోస్టర్ రానుంది. ఇది సినిమా సినిమాకి మధ్య కాంపిటేషన్ కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక సెలబ్రేషన్ అని చెప్పాలి.
వింటేజ్ పవన్ కళ్యాణ్
దాదాపు 10 సంవత్సరాలు పాటు హిట్ సినిమా లేనప్పుడు, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ఆ సినిమాతో ఒకసారి గా తెలిసి వచ్చింది. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ఆ సినిమా నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి వింటేజ్ పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ చూపించనున్నాడు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే పోస్టర్ ఖచ్చితంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోనున్నట్లు సమాచారం వినిపిస్తుంది.ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న ఓజి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Also Read: Nani : నాని గురించి వాళ్ళ పిన్ని ఏం మాట్లాడారో తెలుసా? వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి