Anjali Marriage: ఇండస్ట్రీలో ఏ చిన్న వార్త అయినా పెద్ద సెన్సేషన్ అవుతుందన్న సంగతి తెల్సిందే.ఇపుడు అందాల తెలుగు భామ అంజలి తన పెళ్లి పై చేసిన కామెంట్స్ అలాగే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి అనేది తన జీవితానికి సంబంధించిన నిర్ణయమని, అందరి కోసం తొందరపడి ఆ నిర్ణయం తీసుకోనని అంజలి చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అంజలి కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో ఫోటో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో కోలీవుడ్ బాట పట్టింది. ఇక అక్కడ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘గీతాంజలి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మసాలా’, ‘బలుపు’, ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ వంటి సినిమాలతో తనకంటూ గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు చేయడం కూడా ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చి పెట్టింది.
అయితే గత కొంతకాలంగా ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇక ఇదే ప్రశ్న ఆమె ముందుకు రావడంతో తనదైన సెటైర్ తో జవాబిచ్చింది. పెళ్లి చేసుకోవడం అనేది తనకు పెద్ద విషయం అని, కేవలం ఇతరుల సంతోషం కోసం మాత్రం పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది.
అంజలి చెప్పిన లాజిక్ కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా ఒక పెళ్లి జరుగుతుంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అంతా కలిసి సందడి చేస్తారు. పెళ్లి కూతురిని అందంగా రెడీ చేయడం, ఫొటోలు తీసుకోవడం, వేడుకల్లో పాల్గొనడం ఇలా అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ సందడి కొన్ని గంటలు లేదా ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటుందని అంజలి అంటోంది. ఆ తర్వాత అసలు జీవితం మాత్రం పెళ్లి చేసుకున్న వ్యక్తిదేనని ఆమె అభిప్రాయం.
“నా పెళ్లి అయిపోయిన తర్వాత అందరూ వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లిపోతారు. కానీ ఆ తర్వాత జీవితాంతం ఉండాల్సింది నేనే కదా” అంటూ పెళ్లి పై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టింది. స్నేహితుల కోసం, బంధువుల కోసం లేదా చుట్టుపక్కల వాళ్లు అడుగుతున్నారని పెళ్లి చేసుకోవడం తనకు సరైన నిర్ణయం కాదని అంజలి డిసైడ్ అయిందన్న మాట.
అంతేకాదు.. పెళ్లి వేడుకలో అసలు ఎవరికి ఎక్కువ ఎంజాయ్‌మెంట్ ఉంటుందనే విషయాన్ని కూడా అంజలి సరదాగా ప్రశ్నించింది. తన స్నేహితులు పెళ్లికి వెళ్లి ఎంజాయ్ చేయాలని కోరుకుంటే అది వాళ్ల ఇష్టం కానీ, వాళ్ల ఎంజాయ్‌మెంట్ కోసం తాను పెళ్లి చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదని అంజలి చెప్పింది.చూడాలి మరి పెళ్లి పై తన అభిప్రాయాన్ని ఇలా తేల్చేసిన ఈ భామ అసలెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో !
also read :నాగ్ అశ్విన్‌కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా?