Nag Ashwin:నాగ్ అశ్విన్..ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మహానటి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. ఇక ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898AD సినిమా ఏకంగా వెయ్యి కోట్ల పై చిలుకు వసూళ్ళని కొల్లగొట్టి టాలీవుడ్ చరిత్రలోనే ఒక మరపు రాని సినిమాగా నిలిచిపోయింది.ఇక ప్రస్తుతం కల్కి కి సీక్వెల్ ని కూడా జోరుగా తెరకెక్కిస్తున్నాడు ఈ క్రేజీ ఫిలిమ్ మేకర్.
ఆదిత్య-369’కు ప్రత్యేక స్థానం
ఇదిలా ఉంటె తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు నాగ్ అశ్విన్ . నాగ్ అశ్విన్‌కు సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, ఫాంటసీ అంశాలంటే ఎంత ఇష్టమో ఆయన సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఆయనకు స్ఫూర్తినిచ్చిన పాత తరం సినిమాల్లో ‘ఆదిత్య-369’కు ప్రత్యేక స్థానం ఉందట. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్‌ను చాలా కొత్తగా పరిచయం చేసిన సంగతి తెల్సిందే.
మళ్లీ తెరకెక్కిస్తే ఎలా
1991లో విడుదలైన ‘ఆదిత్య-369’ అప్పట్లోనే టెక్నాలజీ పరంగా, కథ పరంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. టైమ్ మెషీన్ ద్వారా గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్లే తీరుని సింగీతం కళ్ళకి కట్టినట్టు చూపెట్టారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లే ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్.ఇక బాలకృష్ణ కెరీర్‌లో కూడా ఈ సినిమా ఓ ప్రత్యేక మైలురాయిగా నిలిచిందనడంలో సందేహం లేదు. ఇలాంటి క్లాసిక్‌ను ఇప్పటి టెక్నాలజీతో మళ్లీ తెరకెక్కిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడట
అదెప్పుడు పట్టాలెక్కుతుందో
నాగ్ అశ్విన్. అవకాశం వస్తే ‘ఆదిత్య-369’ను కొత్త తరానికి తగ్గట్టుగా మళ్లీ తీయాలని ఆయన ఇష్టాన్ని బయటపెట్టాడు.ముఖ్యంగా ఇప్పటి జెన్ జీ ప్రేక్షకులకు ఆ కథను, ఆ ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ఆలోచన తనకు ఉందని చెప్పడం విశేషం.మరి అదెప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
‘ఆదిత్య-369’ గురించి మాట్లాడితే దాని సీక్వెల్ ‘ఆదిత్య-999’ టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌పై బాలకృష్ణ కూడా గతంలో కరోనా సమయంలో ‘ఆదిత్య-999’ కథను సిద్ధం చేశానని, తానే దర్శకత్వం వహించే ఆలోచన ఉందని బాలకృష్ణ స్వయంగా చెప్పారు. ఇక బాలకృష్ణ దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ కథ వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా నందమూరి అభిమానుల్లో కనిపించింది కూడా.
ఎలాంటి కాంబోలు ఆన్ బోర్డ్ అవుతాయో
మొత్తానికి ఇప్పుడు నాగ్ అశ్విన్ కామెంట్స్ తో మరోసారి ఆదిత్య-369’ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది,అయితే కొంతమంది ఒక అడుగు ,ముందుకు వేసి బాలయ్య ,మొక్షు ని కలిపి నాగీ ఈ సినిమాని తీస్తే మరింత బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు కూడా ,చూడాలి మరి వచ్చే రోజుల్లో ఎలాంటి కాంబోలు ఆన్ బోర్డ్ అవుతాయో !