E-Paper
Advertisement

షూటింగ్లో గాయపడ్డ జూ.ఎన్టీఆర్.. స్పందిస్తున్న సెలబ్రిటీస్!

షూటింగ్లో గాయపడ్డ జూ.ఎన్టీఆర్.. స్పందిస్తున్న సెలబ్రిటీస్!
Advertisement

Jr NTR:గత కొన్ని రోజులుగా సెలబ్రిటీలు తరచూ షూటింగులలో గాయపడుతూ అభిమానులను ఆందోళనలకు గురి చేస్తున్నారు.. మొన్నటికి మొన్న రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఆయన చేతి మణికట్టుకి గాయం కావడంతో.. కోయంబత్తూర్ లోని గంగా హాస్పిటల్ లో జూలై 27న సర్జరీ కూడా చేయించుకున్నారు.. నిన్నటికి నిన్న బాలకృష్ణ (Balakrishna) కూడా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వస్తున్న NBK 111 సినిమా షూటింగ్ కాకినాడ పోర్టులో జరుగుతుండగా.. కాలుజారి కింద పడ్డారు. ఆయన కూడా హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో మోకాలుకు సర్జరీ చేయించుకున్నారు. అటు మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) కూడా ‘కొరియన్ కనకరాజు’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో చేతి కర్రతో కనిపించి ఆశ్చర్యపరిచారు.

షూటింగ్లో గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్..

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా తన సినిమా షూటింగ్లో గాయపడ్డారు అన్న వార్త అభిమానులను కలవరానికి గురిచేసింది. జూలై 27న సోమవారం సాయంత్రం.. ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లో ఆయన భుజానికి స్వల్ప గాయమైనట్టు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. గాయం గురించి సమాచారం అందిన వెంటనే.. అటు కుటుంబ సభ్యులు ఇటు వైద్యులు అప్రమత్తమయ్యారు.

8 వారాలు విశ్రాంతి తెలిపిన వైద్య బృందం..

Advertisement

ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ జే.మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని నిపుణుల వైద్య బృందం ఎన్టీఆర్ కి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించగా.. భుజానికి తగిలిన గాయం త్వరగా నయమై.. పూర్తిగా కోల్పోవడానికి కనీసం 8 వారాల సమయం పడుతుందని.. ఆ 8 వారాలు విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్లు సూచించారని తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటామని కూడా ఎన్టీఆర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు , నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

also read:హీరో జయంరవికి కోర్టులో ఊరట.. భార్యకి షాక్!

గెట్ వెల్ సూన్ తారక్ – నారా రోహిత్

Advertisement

మరొకవైపు పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ గెట్ వెల్ సూన్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు. ఈ మేరకు నారా రోహిత్ (Nara Rohit) తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ పంచుకున్నారు.” గెట్ వెల్ సూన్ తారక్.. త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి” అంటూ ట్వీట్ చేశారు.

స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ (S.Thaman)కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి అంటూ ఒక ట్వీట్ చేశారు.” గొప్ప ప్రేమకు అర్హులు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మనందరి ప్రార్థనలు ఆయనకు అవసరం.. ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.. ఎన్టీఆర్ అన్న త్వరగా కోలుకోండి”అంటూ ట్వీట్ చేశారు.

డ్రాగన్ లో లూగర్ గా ఎన్టీఆర్..

ప్రశాంత్ నీళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ డ్రాగన్ మూవీలో కాంతారా బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లూగర్ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తుండగా ..ఇదొక పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Related News

అభిమాని కుటుంబానికి అండగా రామ్ పోతినేని.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో చోరీ.. మొత్తం విలువ ఎంతంటే?

దమ్ముంటే ‘స్పిరిట్’ సినిమాని పడగొట్టండి.. సవాల్ విసిరిన ప్రొడ్యూసర్!

తాళి బొట్టు మహిళలే ఎందుకు వేసుకోవాలి ..నమిత కామెంట్స్ వైరల్ !

కాకా వర్సెస్ విశ్వంభర సంక్రాంతి రేసులో వచ్చేదెవరు?

ఎపిక్‌కి మిక్స్‌డ్ టాక్.. ఫ్లాప్ దిశగా వెళ్తుందా?

ముదురుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. కీలక సమావేశంపై కోర్టు స్టే!

‘శివాజీ’ మూవీ నటుడు ‘సోలమన్ పప్పయ్య’ మృతి!

Big Stories

Advertisement
×