Anna Konidala:ప్రముఖ స్టార్ హీరో,జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా కొణిదెల (Anna konidala) తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా కాలంగా తన పేరును తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ తెలిపిన ఆమె.. తొలిసారి బహిరంగంగా స్పందించారు. అంతేకాదు ఈ మేరకు ఒక సుదీర్ఘ పోస్టును కూడా పంచుకున్నారు. అన్నా లెజినోవా అని ఇకపై ఎవరు పిలవకండి అని , తనను అన్నా కొణిదెల గానే పిలవాలి అంటూ అభిమానులను, నెటిజన్లను అటు మీడియా మిత్రులను విజ్ఞప్తి చేశారు. త్వరలో తన పుట్టినరోజు రానున్న నేపథ్యంలో ఈ విషయాన్ని అధికారికంగా చెప్పడానికి ఇదే సరైన సమయం అంటూ కూడా తెలిపారు. ఒక వ్యక్తికి పేరు అనేది ఎంతో వ్యక్తిగతమైన విషయమని, అందుకే ఈ విషయాన్ని స్పష్టంగా అందరితో చెప్పాలనుకుంటున్నాను అంటూ అన్నా కొణిదెల చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ మేరకు ఆమె తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన పేరును అన్నా కొణిదెలా అని షేర్ చేస్తూనే.. మరొకవైపు తన భర్త పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు. “నా ఇంస్టాగ్రామ్ ఖాతా ప్రారంభించినప్పటి నుంచి ఈ విషయం మీతో చెప్పాలని అనుకున్నాను. ఎన్నోసార్లు రాసి మళ్ళీ డిలీట్ చేశాను. అయితే త్వరలో నా పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఇక ఎలాగైనా సరే ఈ విషయాన్ని మీ అందరితో చెప్పాలని నిర్ణయించుకున్నాను. మా పెళ్లి వార్తలు బయటకు వచ్చిన సమయంలో.. అన్నా లెజినోవా గానే అందరికీ పరిచయం అయ్యాను. అయితే నా వివాహ దృవీకరణ పత్రంలో మాత్రమే ఆ పేరు చివరిసారిగా నమోదయింది. మా పెళ్లి జరిగిన రోజే నేను నా భర్త ఇంటి పేరును స్వీకరించి, అన్నా కొణిదెలగా మారాను. అందుకే ఇకపై ప్రతి ఒక్కరు నన్ను అన్నా కొణిదెల అని మాత్రమే పిలవండి.. అదే నా అసలు పేరు.. ఆ పేరులోనే నేను సంపూర్ణంగా ఉండాలని భావిస్తున్నాను. ఇక ఎవరూ కూడా అన్నా లెజినోవా అని పిలవకండి” అంటూ విజ్ఞప్తి చేశారు.
ALSO READ:ఏంటీ.. శ్రీనిధి శెట్టి వెంకటేష్ కి కూతురుగా నటిస్తోందా?
అలాగే తన భర్త పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన అందమైన ఫోటోని కూడా షేర్ చేస్తూ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నగరానికి మేమిద్దరం కలిసి వెళ్లినప్పుడు.. తొలి పర్యటనలో భాగంగా తీసుకున్న ఫోటో అది అంటూ పేర్కొన్నారు. త్వరలో తన పుట్టినరోజు రాబోతోందని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు ముందుగానే.. “హ్యాపీ అడ్వాన్స్ బర్తడే వదినమ్మ” అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది” ఇకపై మిమ్మల్ని అలాగే పిలుస్తాం” అంటూ కూడా కామెంట్ చేశారు. ఏదేమైనా అన్నా కొణిదెల చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.