E-Paper
Advertisement

పావలా శ్యామల అంత్యక్రియలు.. బాధ్యత మొత్తం ‘మా’దే -కరాటే కళ్యాణి

పావలా శ్యామల అంత్యక్రియలు.. బాధ్యత మొత్తం ‘మా’దే -కరాటే కళ్యాణి
Advertisement

Karate Kalyani:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో చెరగని ముద్ర వేసుకున్న నటి పావలా శ్యామల (Pavala shyamala) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని నవ్వించిన ఈమె.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా బ్రతికిన ఈమె.. కాలక్రమేనా ఆర్థిక సమస్యలు ఏర్పడడంతో దిక్కుతోచని స్థితిలో అనాథలా రోడ్డు పైకి వచ్చిన ఎన్నో దృశ్యాలు అందరి చేత కంటతడి పెట్టించాయి. అలా గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నటి పావలా శ్యామల జూలై 28న హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1:52 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని ఉస్మానియా హాస్పిటల్ లోనే మార్చురీలో భద్రపరిచారు.

నటి పావలా శ్యామల అంత్యక్రియలు..

ఈమెకు ఒక కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. ఆమె కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమెను కూడా ఉస్మానియా హాస్పిటల్ లోనే ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం పావలా సామల అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ లేని పక్షంలో ‘మా’ అసోసియేషన్ తరఫున ప్రముఖ సీనియర్ నటి కరాటే కళ్యాణి (Karate Kalyani) స్పందించారు. “ఉదయం లేవగానే పావలా శ్యామల గారు మృతి చెందారు అనే వార్త నన్ను మానసికంగా మనోధైర్యాన్ని కోల్పోయేలా చేసింది. ఎప్పటినుంచో ఆమె గురించి నేను ఆరా తీస్తూనే ఉన్నాను. ఏ ఏ వృద్ధాశ్రమాల్లో ఆమె ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? అనే విషయాల గురించి.. వనస్థలిపురంలో ఉండే ఒక వృద్ధాశ్రమానికి సంబంధించిన శంకర్ అనే అబ్బాయి తో కలసి నేను కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చాను. నిన్న రాత్రి శంకర్ కి ఫోన్ చేశారు.. వెంటనే ఆయన పావలా శ్యామలను ఉస్మానియా హాస్పిటల్ లో చేర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. చికిత్స పొందుతూ..ఆమె గుండెపోటుతో నిన్న రాత్రి కాలం చేశారు. ఆమె కూతురు కూడా ఉస్మానియాలోనే ఉన్నారు.

పూర్తి బాధ్యత మా అసోసియేషన్ తీసుకుంటుంది – కరాటే కళ్యాణి

Advertisement

ఫైనల్ రైట్స్ అయ్యేవరకు నేనే దగ్గరుండి చూసుకుంటాను. దీనికి మా అసోసియేషన్ పూర్తి బాధ్యత వహిస్తుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెడుతుంది. ముందు నుంచి ఆవిడ గురించి తెలుసుకుంటూ ఎన్నో విషయాలలో సపోర్ట్ చేసాము. ఎన్నో వృద్ధాశ్రమాలలో ఆమెను జాయిన్ చేసాము. ఈ కారణంగానే ఈ బాధ్యతను నాకు అప్పజెప్పారు.ఈ విషయం తెలియగానే నేనే దగ్గరుండి మొత్తం ఖర్చు పెట్టాలనుకున్నాను. కానీ మా అసోసియేషన్ నాకు ఫోన్ చేసి మీరే మొత్తం బాధ్యత చూస్కోండి. కానీ ఒక రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టొద్దు.. మొత్తం మేమే భరిస్తామని చెప్పారు.

Also read:పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ భార్య!

అంత్యక్రియలు అక్కడే..

Advertisement

వనస్థలిపురంలో శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమం ఉంది. జూలై 29న వనస్థలిపురంలోని శంకర్ వాళ్ళ ఉద్రాశ్రమం సమీపంలో ఉండే స్మశాన వాటికలో పావలా శ్యామల అంత్యక్రియలు పూర్తి చేస్తాము. ఎవరైనా ఆమెను చివరిసారిగా చూడాలి అనుకుంటే వనస్థలిపురం లో ఉన్న వృద్ధాశ్రమానికి రండి” అంటూ తెలిపింది కరాటే కళ్యాణి.

పావలా శ్యామలకు అండగా మా అసోసియేషన్..

ఇకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గతంలో కూడా పావలా శ్యామలకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఆమెకు ప్రతినెలా కొంత మొత్తంలో పెన్షన్ ఇవ్వడంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం..

Related News

పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ భార్య!

ఏంటీ.. శ్రీనిధి శెట్టి వెంకటేష్ కి కూతురుగా నటిస్తోందా?

హీరోయిన్ హెబ్బా పటేల్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత…

హీరోయిన్లకు ఉన్న ఈ వింత అలవాట్లు తెలిస్తే షాక్ అవుతారు!

సినిమా పైరసీకి కేంద్రం షాక్.. వేల వెబ్‌సైట్లు బ్లాక్!

ఒకే రోజు ఐదారు సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఈ కొట్టుడేంది సామీ!

Big Stories

Advertisement
×