E-Paper
Advertisement

ఏంటీ.. శ్రీనిధి శెట్టి వెంకటేష్ కి కూతురుగా నటిస్తోందా?

ఏంటీ.. శ్రీనిధి శెట్టి వెంకటేష్ కి కూతురుగా నటిస్తోందా?
Advertisement

Adarsha kutumbam:విక్టరీ వెంకటేష్ (Venkatesh)హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెంబర్ 47’. శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నుండి జూలై 27వ తేదీన మేకర్స్ వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ.. ఒక చిన్న టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నా.. మరొకవైపు వెంకటేష్ తన నటనతో అలరించినప్పటికీ.. ఇందులో శ్రీనిధి శెట్టి వెంకటేష్ పిలిచిన పిలుపు అందరిలో అనుమానాలను రేకెత్తిస్తోంది. ముందుగా ప్రకటించిందేమో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా అంటూ ప్రకటించారు.. మరి టీజర్ లో ఏంటి ఇలా నాన్న అని పిలిచేసింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో భారీగా పేలుతున్న మీమ్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. వెంకటేష్ ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ జూలై 27న టీజర్ రిలీజ్ చేశారు. అందులో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ..” నాన్న వంటగదిలో ఏసీ కూడా ఉంది. మీరు ఏసీ వేసుకొని వంట హాయిగా చేయొచ్చు. అలాగే వాషింగ్ మిషన్ కూడా ఉంది.. మీకు అసలు పనే ఉండదు” అంటూ చేసిన కామెంట్లు సరదాగా ఉన్నా.. అందులో శ్రీనిధి శెట్టి వెంకటేష్ ను “నాన్న” అని పిలవడం సోషల్ మీడియాలో ట్రోల్స్ కి దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో వెంకటేష్ కి శ్రీనిధి శెట్టి కూతురుగా నటిస్తోందా ? లేక భార్యగా నటిస్తోందా ? అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఈ టీజర్ క్లిప్ పై ఒక రేంజ్ లో పెద్ద ఎత్తున మీమ్స్ కూడా వైరల్ చేస్తున్నారు.

Advertisement

ALSO READ:అదే నాకు భారతరత్న.. అవార్డులపై స్పందించిన సీనియర్ హీరో సుమన్!

వెంకటేష్ కి కూతురా? లేక భార్య?

పైగా ఈ వీడియోని ఆ క్లిప్ ని పదేపదే షేర్ చేస్తూ..” ఫస్ట్ నువ్వు కూడా నాలాగే వైఫ్ క్యారెక్టర్ అనుకున్నావ్ కదా?” అంటూ మీమ్స్ పేలుస్తున్నారు . మరొకవైపు ఈ టీజర్ చూసిన తర్వాత దీనిని త్రివిక్రమ్ తీస్తున్నాడా? మేము ఇంకా అనిల్ రావిపూడి తీస్తున్నాడేమో అనుకున్నామే అంటూ డైరెక్టర్ పేరును కూడా తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి కొంతమంది నాన్న, బుజ్జి , కన్న అని భర్తను పిలుచుకున్నట్టుగానే.. శ్రీనిధి శెట్టి కూడా ఇక్కడ తన భర్తను నాన్న అని ప్రేమగా పిలుస్తోంది. ఇందులో ఆమె వైఫ్ క్యారెక్టర్ చేస్తోంది అంటూ ఇలా ఎవరికి తోచింది వారు కామెంట్ లు పెడుతున్నారు.

శ్రీనిధి శెట్టి ఇంట్రడక్షన్ వీడియో విడుదల ఈరోజే..

Advertisement

ఇకపోతే శ్రీనిధి శెట్టి ఇందులో స్వర్ణ పాత్రలో నటించబోతోంది. ఈ పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో నేడు రిలీజ్ చేయబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తుండగా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో నారా రోహిత్ (Nara Rohit) పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు.

Related News

పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ భార్య!

హీరోయిన్ హెబ్బా పటేల్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత…

హీరోయిన్లకు ఉన్న ఈ వింత అలవాట్లు తెలిస్తే షాక్ అవుతారు!

సినిమా పైరసీకి కేంద్రం షాక్.. వేల వెబ్‌సైట్లు బ్లాక్!

ఒకే రోజు ఐదారు సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఈ కొట్టుడేంది సామీ!

బాలయ్య బాబు ఆసుపత్రిలో.. కొరటాల సెట్‌లో..జోరుమీదున్న NBK 112

Big Stories

Advertisement
×