E-Paper
Advertisement

కన్నీళ్లు పెట్టుకున్న శ్వేత.. తండ్రి చేసిన పనితో?

కన్నీళ్లు పెట్టుకున్న శ్వేత.. తండ్రి చేసిన పనితో?
Advertisement

Bigg Boss 10:వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్.. 10వ సీజన్ కూడా ప్రారంభమైంది. అప్పుడే 9 వారాలు పూర్తి కాగా పదవ వారానికి సంబంధించి ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో భాగంగా ఒక్కొక్క కంటెస్టెంట్ కి బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇస్తూ.. వారి ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఉదయం విడుదల చేసిన ప్రోమోలో నరేష్ బ్రదర్ హౌస్ లోకి వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇవ్వగా.. ఇప్పుడు శ్వేతా నాయుడు సోదరితో పాటు తండ్రి కూడా వచ్చారు.

ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో సందడి చేసిన శ్వేత ఫ్యామిలీ..

ఫ్యామిలీ వీక్ లో భాగంగా 65వ రోజుకు సంబంధించి విడుదల చేసిన రెండవ ప్రోమోలో ఇంగ్లీష్ టీచర్గా నరేష్, కెమిస్ట్రీ టీచర్గా వర్షిని సందడి చేశారు.. ఇక తర్వాత బజర్ మోగగా శ్వేతా నాయుడుకి రెండు కుక్కపిల్లలు ఉన్న ఫోటో వచ్చింది. ఇక అందరూ ఫ్రీజ్ అవ్వమని బిగ్ బాస్ చెప్పగానే ఫ్రీజ్ అయిపోయారు. సడన్గా శ్వేతా నాయుడు సోదరి హౌస్ లోకి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న హౌస్ లోకి రావట్లేదు అన్నట్లుగా ఒక లెటర్ ఇచ్చింది. అది చూసి తన తండ్రిని చూడలేకపోతున్నాను అనుకొని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. సడన్గా ఆమె తండ్రి హౌస్ లోకి వచ్చేసరికి ఆనందంతో ఉప్పొంగిపోయిన శ్వేతా నాయుడు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. తన తండ్రికి హౌస్ లోకి వచ్చే ముందే హార్ట్ సర్జరీ చేశారని, తన తండ్రిని చూడాలని ఉంది అంటూ ఇటీవల శ్వేతా నాయుడు మిగతా కంటెస్టెంట్స్ తో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆమె కోరిక మేరకు ఆమె తండ్రిని హౌస్ లోకి తీసుకురావడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది శ్వేత.

Advertisement

also read:వేలకోట్ల ఆస్తులు..అన్నా బిజినెస్ సామ్రాజ్యం చూశారా?

కంటెస్టెంట్స్ ఖుషీ..

ఇక మిగతా కంటెస్టెంట్స్ అందరితో కూడా శ్వేతా నాయుడు తండ్రి మాట్లాడారు. అందులో త్రిగుణ్ మాట్లాడుతూ.. మాట మాట్లాడితే డాడీ డాడీ అంటుంది అంటూ ఆయనను నవ్వించేశారు. చాలా బాగా ఆడుతున్నావు.. నీ టాలెంట్ మొత్తాన్ని బయటకు తీయు అంటూ శ్వేతా కి ఆమె తండ్రి సలహా ఇచ్చారు. తర్వాత బోర్డు పై కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. అందులో ఉన్న వాటిపై ఒక రింగ్ విసరాల్సి ఉంటుంది. ఎందులో పడితే ఆ ఫుడ్డు కంటెస్టెంట్స్ అందరికీ కూడా బిగ్ బాస్ ఆఫర్ చేస్తారు. అలా శ్వేతా నాయుడు సోదరి విసిరిన రింగ్ బటర్ పై పడగా.. శ్వేత తండ్రి విసిరిన రింగ్ ఏకంగా మటన్ పై పడింది. దీంతో మేల్ కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా ఎగిరిగంతేశారు. ఆనందంతో శ్వేతా తండ్రిని ఒక్కసారిగా ఎత్తుకొని సందడి చేశారు. మొత్తానికి అయితే ఫ్యామిలీ వీక్ లో భాగంగా ప్రోమో ఎమోషనల్ గా ఇటు సంతోషంగా ఆకట్టుకుంది.

Advertisement

Related News

శృతి రాకతో రెచ్చిపోయిన దుల్కర్.. జగపతిబాబు షోలో ఎన్నో ముచ్చట్లు!

జాను లిరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఏవో తెలుసా?టాప్ ఫోక్ సాంగ్స్ ఇవే!

నరేష్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈ ట్విస్ట్ ఏంటి సామి!

నవ్య సామి సీరియల్స్ గుడ్ బై చెప్పడానికి కారణమేంటి..?

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. మనోజ్ కు పిచ్చి పట్టిందా..? శృతి సీరియస్..

Karthika Deepam 2 Serial Today Episode November 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ కు జ్యోత్స్న నిజం చెప్తుందా..? 

Podarillu Today Episode : మాధవ్ ప్రేమ పాఠాలు.. శైలుకు షాక్.. బాధపడ్డ కన్నా..ఇదే కదా ట్విస్ట్..

Big Stories

Advertisement
×