E-Paper
Advertisement

శృతి రాకతో రెచ్చిపోయిన దుల్కర్.. జగపతిబాబు షోలో ఎన్నో ముచ్చట్లు!

శృతి రాకతో రెచ్చిపోయిన దుల్కర్.. జగపతిబాబు షోలో ఎన్నో ముచ్చట్లు!
Advertisement

Jayammu Nishchayammu Raa:టాలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ తనదైన చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. తాజాగా బుల్లితెరపై తన మార్క్ పంచ్‌లతో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ పంచారు. విలక్షణ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2 షోకి దుల్కర్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. దీనికి తోడు అందాల భామలు శృతి హాసన్, సాత్విక వీరపల్లి కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ షో ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ విశేషాలు ఇలా వున్నాయి..

‘ఆకాశంలో ఒక తార’ మూవీ ప్రమోషన్స్ కోసం..:

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఆయన ఈ టాక్ షోకి విచ్చేశారు. సినిమా విశేషాలతో పాటు పర్సనల్ లైఫ్ విషయాలను కూడా సరదాగా పంచుకున్నారు. ఇక జగపతిబాబు తనదైన శైలిలో వేసే కౌంటర్లు, దుల్కర్ రియాక్షన్లు ఈ ఎపిసోడ్‌కు మెయిన్ హైలైట్‌గా నిలిచాయి.

శృతి హాసన్ ఎంట్రీతో మారిపోయిన సీన్:

Advertisement

షో మొదట్లో కొంచెం సైలెంట్‌గా ఉన్న దుల్కర్, హీరోయిన్ శృతి హాసన్ ఎంట్రీ ఇవ్వగానే ఒక్కసారిగా ఫుల్ ఎనర్జీలోకి వచ్చేసారు. “ఇప్పటిదాకా సైలెంట్‌గా ఉన్నాడు, నువ్వు వచ్చిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నాడు” అంటూ జగ్గు భాయ్ వేసిన పంచ్‌కి అందరూ నవ్వుకోవాల్సిందే. ఇక శృతి హాసన్ అల్లరి, ఆమె చేసే హడావుడి ఈ ఎపిసోడ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

తెలుగు నేర్చుకుంటున్న దుల్కర్.. జగ్గు భాయ్ ఫన్నీ కామెంట్స్:

షోలో భాగంగా దుల్కర్‌ని “మీకు తెలుగు వచ్చా?” అని జగపతిబాబు అడుగుతారు. దానికి ఆయన “ఏదో కొంచెం లైట్ గా” అని సమాధానం ఇస్తారు. వెంటనే జగ్గు భాయ్ స్పందిస్తూ.. “పర్వాలేదు, మీరు నేర్చుకుంటున్నారు కదా.. బూతులు మాట్లాడినా మా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు” అంటూ నవ్వులు పూయించారు. ఇక వచ్చిరాని తెలుగుతో దుల్కర్ మాట్లాడే మాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు.

Advertisement

also read:పవన్ కళ్యాణ్ – అన్నా విడాకుల వెనుక అసలు కారణం ఇదేనా?

మరో హీరోయిన్ సాత్విక ఎంట్రీ & ‘మహానటి’ జ్ఞాపకాలు:

ఈ షోలో ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలోని మరో హీరోయిన్ సాత్విక వీరపల్లి కూడా సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమెకు తెలుగు సరిగ్గా రాకపోవడంతో, తప్పుగా మాట్లాడిన చోట దుల్కర్ సరిదిద్దడం, వెంటనే జగ్గు భాయ్ నవ్వుతూ సెటైర్లు వేయడం సరదాగా సాగింది. అంతేకాదు, గతంలో దుల్కర్ నటించిన కల్ట్ హిట్ ‘మహానటి’ సినిమాలోని ఫేమస్ డైలాగ్‌ను ఇప్పుడు మళ్ళీ చెప్పమని జగ్గు భాయ్ అడగగా.. “ఆ రోజు కుదిరింది, ఇప్పుడైతే చెప్పడం కష్టం, అది చాలా లెంత్ ఉంటుంది” అంటూ దుల్కర్ నవ్వుతూ ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

దుల్కర్ సల్మాన్, శృతి హాసన్, సాత్విక వీరపల్లిల సందడితో పాటు జగపతిబాబు హోస్టింగ్ స్టైల్ ఈ ఎపిసోడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ షో ప్రోమోనే ఇంత మజా ఇస్తుంటే, ఇక ఫుల్ ఎపిసోడ్ ఇంకెంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Related News

జాను లిరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఏవో తెలుసా?టాప్ ఫోక్ సాంగ్స్ ఇవే!

నరేష్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈ ట్విస్ట్ ఏంటి సామి!

నవ్య సామి సీరియల్స్ గుడ్ బై చెప్పడానికి కారణమేంటి..?

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. మనోజ్ కు పిచ్చి పట్టిందా..? శృతి సీరియస్..

Karthika Deepam 2 Serial Today Episode November 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ కు జ్యోత్స్న నిజం చెప్తుందా..? 

Podarillu Today Episode : మాధవ్ ప్రేమ పాఠాలు.. శైలుకు షాక్.. బాధపడ్డ కన్నా..ఇదే కదా ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న అంజలి.. తాగొచ్చిన చందు.. ధీరజ్ మాటతో షాక్..

Big Stories

Advertisement
×