Niharika NM:నిహారిక ఎన్‌ఎం..సోషల్ మీడియా స్టార్ గా క్రేజ్ కొట్టేసిన ఈ క్రేజీ బ్యూటీ సినిమాలలోనూ కనిపించి సందడి చేస్తుంది .అయితే కేవలం సినిమాలలోనే కాదు ..ఇపుడు సోషల్ మీడియాలోనూ తనదైన గ్లామరస్ లుక్‌తో నెటిజన్లను ఫిదా చేస్తుంది.
తాజాగా బ్లూ కలర్ శారీలో మెరిసిపోతూ, అదిరిపోయే లుక్ తో కనిపించిన ఆమె ఫొటోలు ఇప్పుడు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయి.ముఖ్యంగా మెరిసే బ్లూ బ్లౌజ్, దానికి మ్యాచ్ అయ్యే శారీ, సింపుల్ జ్యూవెలరీ తో వదిలిన నిహారిక లుక్ చాలా స్పెషల్‌గా ఉందనే చెప్పాలి.
ఎప్పుడూ తన కామెడీ వీడియోలతో నవ్వించే ఈ బ్యూటీ, ఈసారి మాత్రం తన స్టైలిష్ ఫొటోషూట్‌తో సందడి చేయడంతో మెస్మరైజ్ అయిపోతున్నారు ఆడియన్స్ .మరీ ముఖ్యంగా భారీగా నగలు వేయకుండానే అందంగా కనిపించవచ్చని ఈ లుక్‌తో మరోసారి ప్రూవ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇక నిహారిక ఎన్‌ఎం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమె చేసే కామెడీ వీడియోలకు మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా తన ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ టైమింగ్ యూత్‌లో సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది.
అయితే కేవలం ఇన్‌స్టాగ్రామ్ వీడియోలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ సెలబ్రిటీలతో కలిసి కనిపిస్తూ కూడా వార్తల్లో నిలవడం విశేషం .ముఖ్యంగా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్‌తో మిషన్ ఇంపాజిబుల్ ప్రమోషన్ సమయంలో ఆమె చేసిన వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది కూడా.
ఇక సినిమాల విషయానికి వస్తే నిహారిక ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టుల్లో నటిస్తు బిజీ అయిపొయింది. తెలుగులో ప్రియదర్శి, విష్ణు ఓయ్, రాగ్ మయూర్ లు కలిసి నటించిన మిత్ర మండలి సినిమాలో స్వేచ్ఛ పాత్రలో కనిపించి మెప్పించింది.
అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ భామ కాస్త స్లో అయిపొయింది.ఇక తమిళంలో వైభవ్ రెడ్డి నటించిన పెరుసు సినిమాలో శాంతి పాత్ర పోషించి అలరించింది ఈ ముద్దుగుమ్మ .
ఇక 2026లో తమిళ చిత్రం ఇదయం మురళితో పలకరించిన ఈ భామ హిందీ ప్రాజెక్ట్ భాయ్ తేరా స్టార్ హై తో బిజీ అయిపొయింది.మొత్తానికి ఒకప్పుడు ఫన్నీ రీల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నిహారిక ఇప్పుడు ఫ్యాషన్, సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్స్ అంటూ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తుండటం విశేషం . చూడాలి మరి . కామెడీ రీల్స్ తో నవ్వించే నిహారిక ముందు ముందు టాలీవుడ్ లో ఎలాంటి సినిమాలతో పలకరించనుందో!