Anna Lezhneva: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నిత్యం వార్తలో నిలుస్తూ అందరిని ఆకట్టుకుంటున్న ఈమె.. ఇటీవల ఇంస్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే 15 ఏళ్ల కన్ఫ్యూజన్ కి తెర దింపేసింది అన్నా లెజినోవా.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా సోషల్ మీడియా ప్రపంచంలో కొన్ని కొన్ని సార్లు తప్పుడు సమాచారం ఎంత వేగంగా విస్తరిస్తుందో చెప్పడానికి పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల ఎదుర్కొన్న ఈ అనుభవమే నిదర్శనం అని చెప్పవచ్చు. గత 15 సంవత్సరాలుగా ఇంటర్నెట్లో పవన్ కళ్యాణ్ భార్య గురించి వెతికితే ఆయన పక్కన ఉన్న ఒక విదేశీ అమ్మాయి కూర్చున్న ఫోటోలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అయితే ఇన్నాళ్లకు ఆ ఫోటోలో ఉన్నది తాను కాదు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. తను పోస్ట్ చేసిన ఒక పాత ఫోటోపై స్పందిస్తూ..” ఈ అందమైన మహిళ నేను కాదు.. ఈ తప్పును మొదటిసారి ఎవరు చేశారో నాకు తెలియదు కానీ ఈ ఫోటోలు ఉన్న మహిళ పేరు డానా మార్క్స్. నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మోడల్ గా , నటిగా కనిపించలేదు” అంటూ క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ భార్య మోడల్ అని, ఆ తర్వాత నటిగా తీన్మార్ సినిమాలో చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలకు అన్నా ఒక్కసారిగా క్లారిటీ ఇచ్చింది.
ALSO READ:ఊర్లోకి అడుగుపెడితే చంపేస్తామన్నారు.. భయంతో అలాంటి పని చేసిన బుల్లితెర నటి!
ఇకపోతే పవన్ కళ్యాణ్ పక్కన ఒక విదేశీ అమ్మాయి కూర్చుని ఉన్న ఫోటో తీన్మార్ సినిమా ఆడియో ఫంక్షన్ లోనిది. అందులో పవన్ పక్కన ఉన్నది తీన్మార్ సినిమాలో మిచెల్ పాత్ర పోషించిన అమెరికన్ నటి డానామార్క్స్. ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. “బార్బీ బొమ్మకి ” అనే పాటలో తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం అమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీలో నటనలో శిక్షణ ఇస్తూ తన వృత్తిని కూడా కొనసాగిస్తోంది. మొత్తానికైతే దాదాపు 15 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక ఫేక్ వార్తకి అన్నా లెజినోవా ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిందనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ తో అన్నా కొణిదెల పరిచయం ఎలా జరిగింది అనే విషయానికొస్తే వీరిద్దరూ 2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలోనే కలుసుకున్నారు. కానీ ఆ సినిమాలో నటిగా కాదు ఆమె ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తూ పవన్ కళ్యాణ్ దృష్టిలో పడిందట. ఇక అది కాస్త ప్రేమగా మారి 2013 సెప్టెంబర్ 30న హైదరాబాదులోని ఎర్రగడ్డ రిజిస్టర్ కార్యాలయంలో హిందూ వివాహం ప్రకారం వివాహం చేసుకున్నారు. అలా మొత్తానికైతే ఈమె ఇచ్చిన వివరణతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై సాగుతున్న ఒక పెద్ద తప్పుడు ప్రచారానికి పూర్తిగా పులిస్టాప్ పడినట్లు అయింది అని చెప్పవచ్చు.