E-Paper
Advertisement

రణవీర్ సింగ్ ఇంట్లో విషాదం.. అసలేం జరిగిందంటే?

రణవీర్ సింగ్ ఇంట్లో విషాదం.. అసలేం జరిగిందంటే?
Advertisement

Ranveer Singh:ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రణవీర్ సింగ్ (Ranveer Singh) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తాతయ్య (తల్లి వైపు తాత) డాక్టర్ రామ్ హింగోరానీ(Dr.Ram Hingorani)వయోభారంతో బుధవారం రోజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 96 సంవత్సరాలు. దీపావళి పండుగ రోజున నిర్వహించిన లక్ష్మీ పూజ సమయంలోనే ఆయన ప్రశాంతంగా పరలోకానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని రణవీర్ సింగ్ కజిన్ సౌమ్య హింగోరాణి తన అధికారిక ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

సౌమ్య తన సోషల్ మీడియా ఖాతాలో తన తాతయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. 96 సంవత్సరాల నిండు జీవితాన్ని ఆయన గడిపారు. ఇది బాధ పడాల్సిన సమయం కాదు. ఆయన అద్భుతమైన జీవన ప్రయాణాన్ని స్మరించుకుంటూ గడపాల్సిన సమయం. దీపావళి రోజున లక్ష్మీ పూజ సమయంలో ఆయన మా నానమ్మ చెంతకు వెళ్ళిపోయారు. ప్రపంచంలోనే అత్యుత్తమ తాతయ్యగా ఉన్నందుకు కృతజ్ఞులము అంటూ ఆమె తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. రణవీర్ సింగ్ తాతయ్య మరణ వార్త అభిమానులను కలచివేసింది.. అయితే 96 సంవత్సరాల వయసులో ఆయన మరణించడంతో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

రణవీర్ సింగ్ కెరియర్..

Advertisement

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన 2010లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం బ్యాండ్ బాజా బారాత్ చిత్రంలో అనుష్క శర్మతో కలిసి నటుడుగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ఆయన కనబరిచిన అత్యుత్తమ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ పురుష అరంగేట్రం విభాగంలో అవార్డు లభించింది. ఆ తరువాత పలు చిత్రాలలో నటించిన ఈయన బాజీరావు మస్తానీ చిత్రంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. నటుడిగా సినీ పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నేపథ్యంలో 2022 ఫిబ్రవరి 20న ముంబైలో నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2022లో రణవీర్ సింగ్ కి ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది.

ALSO READ:జబర్దస్త్ నుండి బలవంతంగా పంపించేశారు: ధనరాజ్!

దీపికాతో పెళ్లి..

Advertisement

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేను ప్రేమించి మరీ 2018లో వివాహం చేసుకున్నారు. ఇకపోతే ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు.. 2024 సెప్టెంబర్ 8న దువా పదకొనే సింగ్ జన్మించగా.. 2026 సెప్టెంబర్ 19వ తేదీన రెండవ కుమార్తెకు కూడా జన్మనిచ్చారు. అటు దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న రాకా సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ . అంతేకాదు బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు దక్కించుకుంది.

Related News

సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ప్రియా భవాని శంకర్!

నేడే ఘనంగా కావ్య – అనిరుధ్ పెళ్లి.. ప్రత్యేకతలు ఇవే!

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ మూవీ లేనట్టేనా..?

Tollywood Updates : స్టార్ హీరోల సినిమాలు.. షూటింగ్ అప్డేట్స్..

దిశా పటాని నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

ప్రియా భవాని శంకర్ కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

మెగా ఫ్యామిలీ కాదు..డివోర్స్ ఫ్యామిలీ పవన్ పై రెచ్చిపోయిన తమన్నా సింహాద్రి!

Big Stories

Advertisement
×