E-Paper
Advertisement

Milk for Hair: పాలతో జుట్టును శుభ్రం చేస్తే పొడవు పెరుగుతుందా? ఇలా చేస్తే ఏం జరుగుతుంది?

Milk for Hair: పాలతో జుట్టును శుభ్రం చేస్తే పొడవు పెరుగుతుందా? ఇలా చేస్తే ఏం జరుగుతుంది?
Advertisement

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక కొత్త బ్యూటీ ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది. పాలతో జుట్టు కడిగితే జుట్టు చాలా వేగంగా పెరుగుతుందని ఆ బ్యూటీ ట్రెండ్ చెబుతోంది. రసాయనాలకు దూరంగా ఉండాలనుకునేవారు ఇలాంటి సహజ పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటారు. కెమికల్స్ లేకుండా, ఇంట్లోనే లభించే పదార్థాలతో హెయిర్ కేర్ చేసుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. అయితే, ఈ ట్రెండ్ వెనుక ఉన్న నిజం ఏమిటి? నిజంగానే పాలు జుట్టు పెరుగుదల వేగాన్ని పెంచుతాయా?

పాలతో జుట్టు పెరుగుతుందా?
వైద్యులు, హెయిర్ నిపుణుల ప్రకారం పాలు జుట్టుకు ఉపయోగకరమైన పోషకాలు కలిగి ఉంటుంది. అయితే పాలను బయట నుంచి జుట్టుపై రాయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుందని చెప్పేందుకు శాస్త్రీయంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు. జుట్టు పెరుగుదల తల చర్మం లోపల ఉండే హెయిర్ ఫాలికల్స్‌లో జరుగుతుంది. ఈ ఫాలికల్స్ లోపల జరిగే జీవ ప్రక్రియలపై బయట నుంచి వేసే పదార్థాల ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది. అందువల్ల పాలు రాస్తే వెంటనే హెయిర్ గ్రోత్ పెరుగుతుందని అనుకోవడం ఒక అపోహ మాత్రమే.

Advertisement

Also read: Hair Dye: హెయిర్ డై జుట్టుకు వేసుకుంటే కాలేయానికి ప్రమాదమా? ఇదెంత వరకు నిజం

పాలు పూర్తిగా ఉపయోగం లేనివి అని మాత్రం చెప్పలేవు. వాటిలో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు, ఫ్యాట్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టుకు సహజ కండిషనర్‌లా పనిచేస్తాయి. పాలు వాడటం వల్ల జుట్టు మెత్తగా, మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుంది. డ్రైనెస్ తగ్గి, ఫ్రిజ్ కూడా తగ్గుతుంది. దీంతో జుట్టు తక్కువగా విరిగిపోతుంది. ఈ కారణంగా జుట్టు పొడవు పెరిగినట్టు కనిపించవచ్చు. కానీ ఇది కొత్తగా జుట్టు వేగంగా పెరిగినదని కాదు, ఇప్పటికే ఉన్న జుట్టు హెల్తీగా మారడం వల్ల కనిపించే మార్పు మాత్రమే.

Advertisement

జుట్టు పెరగడం వెనుక కారణాలు
జుట్టు నిజంగా వేగంగా పెరగాలంటే మన శరీరంలో జరిగే అంతర్గత మార్పులే ముఖ్యమైనవి. జన్యుపరమైన లక్షణాలు (genetics), హార్మోన్ల స్థాయి, మనం తీసుకునే ఆహారం, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలు హెయిర్ గ్రోత్‌ను ప్రభావితం చేస్తాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఫుడ్ తీసుకోవడం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. పాలు తాగడం ద్వారా ఈ పోషకాలు శరీరానికి అందుతాయి, అది జుట్టుకు మంచిది. కానీ పాలు బయట నుంచి వాడటం మాత్రమే చేసి వెంటనే ఫలితాలు ఆశించడం సరైంది కాదు.

పాలుతో జుట్టు కడిగితే వెంటనే జుట్టు పెరుగుతుందనే నమ్మకం ఒక అపోహ మాత్రమే. అయితే, జుట్టు ఆరోగ్యంగా, మెత్తగా ఉండేందుకు పాలు సహాయపడతాయి. అందువల్ల వీటిని అప్పుడప్పుడు ఉపయోగించవచ్చు కానీ వాటిపై పూర్తిగా ఆధారపడకూడదు. నిజంగా మంచి హెయిర్ గ్రోత్ కోసం స్కాల్ప్ శుభ్రతను పాటించడం, ఒత్తిడి తగ్గించడం, సరైన నిద్ర తీసుకోవడం, కెమికల్స్, హీట్ స్టైలింగ్ తగ్గించడం వంటి అలవాట్లు పాటించడం అవసరం.

Related News

ప్రేమ రూపం చూసి కలుగుతుందా లేక మనసు చూసి పుడుతుందా? నిజం చేదుగా ఉంటుంది

జన్మ సంఖ్య 1 ఉన్నవారికి ఈ తేదీల్లో పుట్టినవారు లక్కీ.. వివాహం జరిగితే అదృష్టం పట్టినట్లే

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నారా? ఈ డిప్రెషన్ నుంచి బయటపడే మార్గాలు ఇవే

పిల్లలకు సైకిల్ నేర్పిస్తున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా, సురక్షితంగా నేర్చుకుంటారు

మందులు తీసుకుంటున్నా కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉందా? మీరు చేసే ఈ 6 తప్పులే కారణం

మీ ఫేస్ కలర్ చామన ఛాయ.. అయితే ఈ 5 లిప్ స్టిక్ షేడ్స్ మీకు సరిపడవు

మనం ఎంతో ఇష్టంగా తినే ఈ ఆహార పదార్థాలు.. ఆ దేశాల్లో కంప్లీట్ బ్యాన్, ఎందుకో తెలుసా?

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

Big Stories

Advertisement
×