Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈమె క్రేజీ కళ్యాణం(Crazy Kalyanam) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే అనుపమ పరమేశ్వరన్ సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ తనకు ఎంతో ఇష్టమైన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హ్యాపీడేస్ సినిమాని 50 సార్లు చూశాను..
అనుపమ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసినప్పటికీ తనకు మాత్రం ఈమె నటించిన సినిమాలు కంటే కూడా ఇతర సినిమాలు అంటేనే చాలా ఇష్టమని తెలిపారు. అందులో భాగంగానే వరుణ్ సందేశ్ తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన హ్యాపీడేస్(Happy Days) సినిమా అంటే తనకు చాలా ఇష్టమని అనుపమ తెలియజేశారు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలలో ప్రసారమైనప్పటికీ తాను చూస్తానని ఈమె తెలిపారు. ఇప్పటివరకు సుమారు ఒక 50 సార్లు హ్యాపీడేస్ సినిమా చూసి ఉంటాను అంటూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హ్యాపీడేస్ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పాలి.
హ్యాపీ డేస్ సినిమా అంటే చాలా ఇష్టం..
కాలేజీ బ్యాక్ డ్రాప్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని చెప్పాలి. ఇక అనుపమ పరమేశ్వరన్ సైతం ఈ సినిమాకు అదే విధంగా కనెక్ట్ కావడంతోనే తనకు ఈ సినిమా బాగా నచ్చిందని తెలియజేశారు. ఇక ఈమె నటిస్తున్న క్రేజీ కళ్యాణం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ విలేజ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా. ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు.ఒక పల్లెటూరి వాతావరణంలో జరిగే పెళ్లి, ఆ పెళ్లి చుట్టూ ఉండే బంధుత్వాల గొడవలు, ఇరు కుటుంబాల మధ్య వచ్చే మనస్పర్థలను వినోదాత్మకంగా మరియు భావోద్వేగభరితంగా ఉండబోతుందని తెలుస్తోంది.
పల్లెటూరు పెళ్లి బ్యాక్ డ్రాప్ లో..
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించగా, టాలీవుడ్ దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు అదేవిధంగా రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్, సీనియర్ నటుడు వీకే నరేష్ వంటి తదితరులు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ వీడియో కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరి క్రేజీ కళ్యాణం అంటూ రాబోతున్న అనుపమ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది.

Share