Bloody Romeo shooting: నాచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్(The Paradise) సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల కావడంతో ఈయన తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. నాని తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు సుజీత్(Sujeeth) డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావడం అదేవిధంగా నాని ఈ సినిమా లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా నాని బ్లడీ రోమియో(Bloody Romeo) సినిమా షూటింగ్ కు సుజిత్ అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ నేపథ్యంలోని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురించి అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులకు సంబంధించి చిత్ర బృందం కీలక అప్డేట్ తెలియజేశారు. ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయని మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ఢిల్లీలో ప్రారంభం కాబోతోందని తెలియజేశారు. ఇలా ఢిల్లీ తరువాత లండన్, హైదరాబాద్ వంటి పరిసర ప్రాంతాలలో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తికానున్నట్లు తెలియజేశారు.
ఈ సినిమాలో నాని చెఫ్ గా, గ్యాంగ్ స్టర్ గా విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాని కెరియర్ లోనే చాలా విభిన్నమైన పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudary) ఈ సినిమాలో ఫైనల్ అయ్యారని తెలుస్తుంది.
ఈ సినిమాలో నాని జోడిగా ఎవరు నటించబోతున్నారనే విషయాలు తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే. సాహో, ఓజీ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుజిత్ బ్లడీ రోమియో సినిమాకు డైరెక్షన్ చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నానితో పోటీ పడడం కోసం మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. సుజిత్ నాని కాంబినేషన్లో రాబోతున్న బ్లడీ రోమియో ద్వారా ఎలాంటి సెన్సేషన్ సృష్టించబోతున్నారనేది తెలియాల్సి ఉంది.
Also Read: నా పెళ్లి నిర్ణయం అతని చేతుల్లోనే… పెళ్లి వార్తలపై మమిత క్రేజీ రియాక్షన్!