E-Paper
Advertisement

చేత్తో తాకకుండానే కార్లు, వస్తువులు గాల్లోకి… ఒక్క గుక్క నీళ్లకు ఇంత పవరా ? ఇంట్రెస్టింగ్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్

చేత్తో తాకకుండానే కార్లు, వస్తువులు గాల్లోకి… ఒక్క గుక్క నీళ్లకు ఇంత పవరా ? ఇంట్రెస్టింగ్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Korean Superhero Movie OTT : సెక్యూరిటీ గార్డుగా పని చేసే ఓ సాధారణ వ్యక్తి కొండ ప్రాంతంలోని నీళ్లు తాగిన తర్వాత తనకి సూపర్ పవర్స్ వచ్చినట్టు గుర్తిస్తాడు. చేత్తో తాకకుండానే వస్తువులను కదిలించగలుగుతాడు. మొదట తనకే ఆశ్చర్యం కలిగించిన ఆ శక్తి, తర్వాత తన కూతురిని ప్రమాదం నుంచి కాపాడేందుకు ఉపయోగపడుతుంది. ఇలాంటి అతీంద్రియ శక్తులు, కుటుంబ అనుబంధం, యాక్షన్, హాస్యంతో రూపొందిన కొరియన్ చిత్రం ‘సైకోకైనసిస్’ (Psychokinesis).

కథలోకి వెళ్తే…

సియోక్-హున్ ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేసే సాధారణ వ్యక్తి. ఒక రోజు కొండ ప్రాంతంలోని నీటిని తాగిన తర్వాత అతడిలో వింత మార్పు మొదలవుతుంది. తన మనసుతోనే వస్తువులను కదిలించగలుగుతున్నాడని తెలుసుకుంటాడు. చేత్తో ముట్టుకోకుండానే వస్తువులను పైకి లేపడం, వాటిని ఒక చోటు నుంచి మరో చోటుకు కదిలించడం వంటి పనులు చేయగలుగుతాడు. మొదట ఈ శక్తిని ఎలా ఉపయోగించాలో అతడికి తెలియదు. కానీ దాన్ని నియంత్రించడం నేర్చుకున్న కొద్దీ తనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కొత్త మార్గం దొరుకుతుంది.

Advertisement

ఇదే సమయంలో అతడి కూతురు రూమీ ఓ పెద్ద సమస్యలో చిక్కుకుంటుంది. ఆమె ఓ షాపింగ్ ప్రాంతంలో దుకాణం నడుపుతుంటుంది. ఆ ప్రాంతాన్ని కూల్చి కొత్త నిర్మాణాలు చేపట్టాలని ఓ నిర్మాణ సంస్థ నిర్ణయిస్తుంది. దుకాణదారులను బలవంతంగా ఖాళీ చేయించేందుకు మిస్టర్ మిన్, అతడి మనుషులను రంగంలోకి దింపుతారు. తమ జీవనాధారాన్ని కోల్పోయే పరిస్థితి రావడంతో రూమీతో పాటు ఇతర దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కూతురు సమస్య గురించి తెలుసుకున్న సియోక్-హున్ ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతకాలం తన జీవితంలో ప్రత్యేకంగా ఉపయోగించని శక్తి ఇప్పుడు కూతురిని, ఆమెతో పాటు నిలబడిన వారిని కాపాడేందుకు ఉపయోగపడుతుందని గ్రహిస్తాడు. అయితే శత్రువులకు డబ్బు, మనుషులు, పవర్ ఉంటాయి. సియోక్-హున్ మాత్రం తన కొత్త శక్తిని మాత్రమే నమ్ముకుని పోరాటంలోకి దిగుతాడు. కూతురిని కాపాడటమే కాకుండా, అన్యాయంగా దుకాణాలు ఖాళీ చేయించే ప్రయత్నాన్ని అడ్డుకోగలడా ? తనకు వచ్చిన శక్తిని సరిగ్గా ఉపయోగించగలడా ? తండ్రిగా రూమీ జీవితంలో మళ్లీ స్థానం సంపాదించుకోగలడా ? అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Also Read : బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

‘సైకోకైనసిస్’ 2018లో విడుదలైన కొరియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ డ్రామా. యోన్ సాంగ్-హో (Yeon Sang-ho) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ర్యూ సీయుంగ్-ర్యోంగ్ (Ryu Seung-ryong), షిమ్ యున్-క్యుంగ్ (Shim Eun-kyung), పార్క్ జియోంగ్-మిన్ (Park Jeong-min), కిమ్ మిన్-జే (Kim Min-jae), జంగ్ యూ-మి (Jung Yu-mi) నటించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. అయితే కొరియన్ ఆడియో మాత్రమే ఉంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.

 

Tags

Related News

కాపురంలో చిచ్చు పెట్టే ఏడేళ్ళ కిందటి ఫోటో… 8.2 రేటింగ్ తో టాప్ లేపుతున్న తమిళ సినిమా

ప్రేమ ఒకరితో… పెళ్లి మరొకరితోనా ? నవ్వులు పూయించే పంజాబీ రొమాంటిక్ కామెడీ

అమాయకపు కుర్రాడు అనుకున్నారు… కట్ చేస్తే ప్రపంచంలోనే పవర్‌ఫుల్ మాంత్రికుడు… ఓటీటీలోకి సీజన్ 2

ఓటీటీలోకి రెండు మైండ్ బ్లోయింగ్ హర్రర్ యానిమే సిరీసులు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

సంగీతంతో ఒక్కటయ్యే బంధాలు… మనసును తాకే భావోద్వేగాలతో తెలుగు ఫ్యామిలీ డ్రామా

బందిపోటుగా మారే స్వాతంత్ర్య సమరయోధుడు… ఓటీటీలోకి బెంగాలీ యాక్షన్ బయోపిక్

వద్దనుకున్న లవర్ సడన్‌గా లైఫ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తే… ఆ కిక్కే వేరప్పా… ఓటీటీలోకి ఎమోషనల్ మూవీ

Big Stories

Advertisement
×