Gadwal Layout: పట్టణ శివారులో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్‌పై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. గద్వాల–ఐజ రహదారిలోని సర్వే నంబరు 871లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్‌లోని రాళ్లను తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ ఏర్పాటు చేసినట్లు గుర్తించి ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, సంబంధిత శాఖల అనుమతులతోనే వెంచర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులు, మున్సిపాలిటీ అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసే వెంచర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు, అవసరమైతే వాటిని కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు సైతం అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి నష్టపోవద్దని సూచించారు.
పట్టణ శివారులో అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించడంతో అనుమతులు లేకుండా ప్లాట్లుగా విభజించి విక్రయించే ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also read: ఫార్ములా-ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్!