Anupuma Parameswaran: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అనుపమ. ఈ సినిమా తర్వాత ప్రేమమ్ సినిమాలో నటించింది. ఒరిజినల్ ప్రేమతోనే చాలామంది తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసింది. ఎందుకంటే ఆ సినిమాని చాలామంది తెలుగు ప్రేక్షకులు వెతుక్కుని మరీ చూశారు.
తెలుగులో అనుపమ కి కూడా మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. శతమానం భవతి సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించకపోవడంతో ఈవిడకి అవకాశాలు తగ్గిపోయాయి. కొంచెం ముందడుగు వేసి రౌడీ బాయ్స్ సినిమాలో నటించిన కూడా ఆ సినిమా ఊహించిన సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇక ప్రస్తుతం పరదా అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తుంది.
ప్రమోషన్స్ కి డబ్బులు లేవు
పరదా అనే సినిమా వాస్తవానికి ఎప్పుడు రిలీజ్ కావలసి ఉంది. అయితే కొన్ని సినిమాలు కొన్ని డేట్స్ లో అనౌన్స్ చేయడం వలన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ వెళ్లారు. అయితే చెప్పిన డేట్ కి ఆ సినిమాలు రాకపోవడం కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్ అయిపోయింది. కంటెంట్ రెడీ అయిపోయి చాలా రోజులవుతున్న రిలీజ్ కి నోచుకోలేదు. మొత్తానికి ఆగస్టు 22న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ఈ తరుణంలో మాకు సినిమాని ప్రమోషన్ చేయడానికి డబ్బులు లేవు. రివ్యూ నచ్చితేనే సినిమా చూడండి అంటూ అనుపమ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మామూలుగా అయితే రివ్యూలు నమ్మొద్దు మీరు వెళ్లి సినిమా చూడండి ఖచ్చితంగా నచ్చుద్ది అంటుంటారు. కానీ ఈ సినిమాకి మాత్రం డిఫరెంట్ గా చెప్పింది అనుపమ.
కాన్ఫిడెన్స్ కూడా కావచ్చు
సినిమా బండి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ సినిమా తరువాత ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన సినిమా శుభం. ఈ సినిమాను సమంత నిర్మించారు. ఈ సినిమాకు భారీగా ప్రమోషన్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ షో చూసిన వెంటనే మౌత్ టాకుతోనే హిట్ చేస్తారు అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు ప్రవీణ్ కాండ్రేగుల. ఇప్పుడు రివ్యూ నచ్చితేనే చూడండి అంటుంది అనుపమ. ఏదేమైనా ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో మాత్రమే అలా మాట్లాడుతున్నారు అని ఈ స్టేట్మెంట్ లు చూస్తే అర్థమవుతుంది.
Also Read: Varsha Bollamma : సీనియర్ నటుడిని కాలుతో తన్నిన హీరోయిన్, అంత గొడవ ఏమి జరిగింది?