Varsha Bollamma : చూసి చూడంగానే సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంటర్ ఇచ్చింది వర్ష బొల్లోమా. ఆ సినిమా కంటే ముందు 96 సినిమాతో మంచి గుర్తింపు సాధించుకుంది. ఈరోజుల్లో ఒక సినిమా బాగుంది అనే ప్రస్తావన వస్తే భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ చూస్తారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
అలానే 96 సినిమా గురించి చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అయితే ఆ సినిమాను చూస్తున్న తరుణంలో ఆ సినిమాలో వర్షా బొల్లోమా ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా అనిపించింది. అలానే విజయ్ నటించిన విజిల్ సినిమాలో కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించింది. సో తనకంటూ తెలుగులో ఒక గుర్తింపు ఉంది. చూసి చూడంగానే సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
సీనియర్ నటుడిని కాళ్ళుతో తన్నింది
వర్షా కి మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈటీవీ విన్ లో వర్షా నటించిన కానిస్టేబుల్ కనకం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 14న ఇది ప్రీమియర్ కి రానుంది. ఈ సిరీస్ కు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. వర్ష తో పాటు ప్రముఖ నటులు ఈ సినిమాలో కనిపించనున్నారు. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ తరుణంలో ఈ సిరీస్ షూటింగ్లో జరిగిన ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు రాజీవ్ కనకాల.
ఆ వీడియోలో కానిస్టేబుల్ కనకం తన టాలెంట్ చూపిస్తుంది. రాజీవ్ కనకాల వర్షా బొల్లోమా కి ఎదురుగా నిల్చని చేయిపెట్టారు. అయితే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ తన కాళ్లు హైటు లేపినట్లు, వర్ష బొల్లమ్మ కూడా తన కాలు లేపుతూ రాజీవ్ కనకాల చేతిని టచ్ చేసింది. ఇది చాలా ఫన్నీ ఇన్సిడెంట్. దీనిని రాజీవ్ కనకాల ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ కానిస్టేబుల్ కనకం తన్నింది అంటూ ఆ వీడియోలో తెలియజేశారు.
2 days to go for constable kanakam….
Trailer: https://t.co/GbP5jcwzxH
#ConstableKanakam #etvwin pic.twitter.com/hkK55Ib6ZY
— Raajeev kanakala (@RajeevCo) August 12, 2025
మిడిల్ క్లాస్ మెలోడీస్ గుర్తింపు
వర్షా వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలానే బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమైన స్వాతిముత్యం సినిమా మంచి సక్సెస్ సాధించింది. సందీప్ కిషన్ తో కలిసి నటించిన ఊరి పేరు భైరవకోన సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన తమ్ముడు సినిమా ఊహించిన సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇక కానిస్టేబుల్ కనకం ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read: Coolie: తెలుగు రాష్ట్రాల్లో రజనీ ర్యాంపేజ్, ఇదయ్యా మీ అసలు స్టామినా