Aamir Khan: అమీర్ ఖాన్ (Aamir khan).. బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న అమీర్ ఖాన్.. అతి తక్కువ సమయంలోనే ఊహించని పాపులారిటీ అందుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్ తో చలామణి అవుతూ వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఒకవైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. మరొకవైపు సౌత్ సినిమాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ.. ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కోలీవుడ్లో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న కూలీ (Coolie) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
15 నిమిషాల కోసం రూ.20 కోట్లు..
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ కూలీ చిత్రంలో అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈయన క్యామియో పాత్ర పోషిస్తున్నారని, క్లైమాక్స్లో ఈయన పాత్ర హైలెట్ గా ఉండనుంది అని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో దాదాపు 15 నిమిషాల పాటు అమీర్ ఖాన్ కనిపించనున్నారట. మరి ఈ 15 నిమిషాల కోసం అమీర్ ఖాన్ తీసుకోబోయే రెమ్యూనరేషన్ తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయకమానదు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అమీర్ ఖాన్ ఈ సినిమాలో క్యామియో పాత్ర పోషిస్తున్నారని, ఆ స్పెషల్ క్యారెక్టర్ కోసం ఏకంగా రూ.20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అసలు నిజం ఇదే?
అయితే ఈ విషయం తెలిసి అమీర్ ఖాన్ రేంజ్ మామూలుగా లేదుగా అని అందరూ కామెంట్లు చేస్తూ ఉండగా.. ఇప్పుడు విస్తుపోయే నిజం మరొకటి బయటపడింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ముఖ్యంగా రజనీకాంత్ అలాగే కూలీ టీం పై ఆయనకున్న గౌరవం, ప్రేమ కారణంగానే ఇలా పూర్తిగా రెమ్యూనరేషన్ నిషేధించినట్లు సమాచారం. దీనికి తోడు కథ కూడా వినకుండా ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది.
నా సినీ కెరియర్ లో అలా చేయడం అదే మొదటిసారి – అమీర్ ఖాన్..
ఇకపోతే ఈ సినిమా పై తనకున్న ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియక ఈ విధంగా చేశాను అంటూ ఈ కూలీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. “లోకేష్ నన్ను కలవడానికి వచ్చారు. నన్ను కలవడానికి ఎందుకు వస్తున్నాడో కూడా నాకు తెలియదు. వచ్చి ఇది కూలి కోసం.. ఈ సినిమాలో నువ్వు ఒక పాత్ర చేయాలి అని అడిగాడు. ఇక స్క్రిప్ట్ వినకుండానే.. రజినీకాంత్ సార్ సినిమా అని చెప్పిన మరుక్షణమే ఒప్పుకున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే స్క్రిప్ట్ వినకుండా నా సినీ కెరియర్ లోనే మొదటిసారి చేస్తున్న సినిమా ఇది”.. అంటూ అమీర్ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Nidhhi Agerwal: నిధి అగర్వాల్ తిరిగిన వాహనంపై కఠిన చర్యలు.. అసలేమైందంటే?