E-Paper
Advertisement

‘క్రేజీ కళ్యాణం’ టీజర్.. కూతురి పెళ్లిగోల, దరిద్రమైన అల్లుడు రావాలని కోరే తండ్రి!

‘క్రేజీ కళ్యాణం’ టీజర్.. కూతురి పెళ్లిగోల, దరిద్రమైన అల్లుడు రావాలని కోరే తండ్రి!
Advertisement

Crazy Kalyanam teaser: ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) ప్రధాన పాత్రలో లేడీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran)హీరోయిన్గా వీకే నరేష్ (VK Naresh) కీలక పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం క్రేజీ కళ్యాణం.. యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్.2 గా రాబోతున్న ఈ చిత్రానికి ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ భూషణ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో షూటింగ్..

దర్శకుడు భద్రప్ప గాజుల రూపొందిస్తున్న ఈ చిత్రంలో రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ వడ్డేమారి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుండడం గమనార్హం. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను తెలంగాణలోనే పలు గ్రామీణ ప్రాంతాలలో చిత్రీకరణ జరిపారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

క్రేజీ కళ్యాణం టీజర్ రిలీజ్..

Advertisement

జూలై 31న ఘనంగా క్రేజీ కళ్యాణం టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. ఆగస్టు 1న టీజర్ ను విడుదల చేశారు. టీజర్ విషయానికి వస్తే.. తన తండ్రి (వీకే నరేష్) జుట్టుకి కలర్ వేస్తూ అనుపమ ఇచ్చిన లుక్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. నరేష్ మాట్లాడుతూ..” చెప్పు తల్లి ఎలా చేయాలి నీ పెళ్లి? ఎంత బంగారం కావాలి? ఎన్ని చీరలు కావాలన్నా కొనుక్కో.. నీ దోస్తులందరినీ పిలుచుకో.. జోరుగా చేస్తా నీ పెళ్లి” అనే డైలాగుతో టీజర్ ప్రారంభించారు. కట్ చేస్తే ఎర్ర గులాబీల నడుమ ఎరుపెక్కిన బుగ్గలతో గుర్రుగా పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిపై అనుపమ ఒక రేంజ్ లో విరుచుకుపడడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

also read: ఆపిల్స్ కోసం.. జ్వరం రావాలని కోరుకొనేవాళ్లం.. చికెన్ కూడా కొనలేని పరిస్థితి: నూకరాజు

టీజర్ ఎలా ఉందంటే?

Advertisement

అనుపమ వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడుతూ.. “ఇదిగో నీ కొడుకే మొండోడనుకుంటున్నాడేమో.. నాలో కూడా ఆయన రక్తమే ప్రవహిస్తోంది” అనే డైలాగ్ ఆకట్టుకుంది. ఎన్ని సంబంధాలు తెచ్చినా కూతురు ఒప్పుకోకపోయేసరికి.. “దేవుడా నా పెద్ద అల్లుడు కంటే ఇంకా దరిద్రపోడు మా అన్నకు అల్లుడుగా రావాలి ” అంటూ నరేష్ చెప్పే డైలాగు నవ్వులు పూయిస్తుంది. మధ్యలో తరుణ్ భాస్కర్ మాస్ ఎంట్రీ, అఖిల్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. “ఏం ఫ్యామిలీ రా నాయనా.. బ్రతకనివ్వరు.. చావనివ్వరు” అంటూ తరుణ్ భాస్కర్ కొట్టే డైలాగ్ ఆకట్టుకుంది. అలా మొత్తానికైతే పెళ్లి గోల.. దరిద్రపు అల్లుడు రావాలని కోరుకునే తండ్రి.. ఈ క్రేజీ కళ్యాణం టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

Related News

Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. ఇది అస్సలు ఊహించలేదు మావా..!

సాయి పల్లవి కోసం.. ‘రామాయణ్’ సాంగ్‌లో ఆ నటిని బ్లర్ చేశారా?

ఫాహ్.. ఈ ఫన్నీ సౌండ్‌కు స్ఫూర్తి కమెడియన్ వేణు మాధవ్?

ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక..ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే!

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!

టికెట్ ధరల పెంపు.. సినిమాకే నష్టం.. నిర్మాతలు ఆలోచించండి!

Big Stories

Advertisement
×