E-Paper
Advertisement

సంపాదన తక్కువ.. ఖర్చు ఎక్కువ.. అప్పులతో నెట్టుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం?

సంపాదన తక్కువ.. ఖర్చు ఎక్కువ.. అప్పులతో నెట్టుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం?
Advertisement

Fiscal Deficit: ఒక సామాన్య కుటుంబంలో నెలకు వచ్చే జీతం ఎంత? దాంట్లో ఇంటి అద్దె, కిరాణా సామాను, పిల్లల ఫీజులకి ఎంత ఖర్చవుతుంది? భవిష్యత్తు కోసం ఎంత దాచుకుంటున్నాం? అని లెక్కలు వేసుకుంటాం కదా! సరిగ్గా అలాగే మన భారత ప్రభుత్వం కూడా దేశం కోసం ఖర్చు చేసిన ఈ ఆరు నెలల లెక్కలను విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు గాను ప్రభుత్వం మొత్తం 18.35 లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే.. ఏకంగా 25.49 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంటే సంపాదన కంటే ఖర్చు ఎక్కువుందన్నమాట. ఆ మిగితా డబ్బు అప్పుల ద్వారా తీసుకుందన్నట్టు. దీనినే ఆర్థిక పరిభాషలో ‘ద్రవ్యలోటు’ అంటారు.

మొత్తం ఆదాయంలో..

అసలు ప్రభుత్వానికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చూస్తే.. మొత్తం ఆదాయంలో 70 శాతం కేవలం మనం కట్టే రకరకాల పన్నుల ద్వారానే వచ్చింది. అంటే పన్నుల రూపంలోనే 12.76 లక్షల కోట్ల రూపాయలు సర్కార్ ఖాతాలోకి వచ్చాయి. ఇక మిగతా 26 శాతం ఆదాయం బ్యాంకుల డివిడెండ్లు, ఫీజులు లాంటి పన్నుయేతర మార్గాల ద్వారా రాగా.. మరో 4 శాతం పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో వచ్చింది. ఇక వచ్చిన ఆదాయంలో నుంచి కేంద్ర ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకోకుండా.. 6.99 లక్షల కోట్ల రూపాయలను వివిధ రాష్ట్రాలకు పన్నుల వాటా రూపంలో పంచేసింది. ఇది పోయిన ఏడాదితో పోలిస్తే ఏకంగా 67 వేల కోట్లు ఎక్కువ కావడం విశేషం.

ఏకంగా 74 శాతం..

Advertisement

ఇక ఖర్చుల విషయానికి వస్తే.. ప్రభుత్వం చేసిన 25.49 లక్షల కోట్ల ఖర్చులో ఏకంగా 74 శాతం రోజువారీ అవసరాలకే సరిపోయింది. దీనినే సాంకేతిక పరిభాషలో ‘రెవెన్యూ ఖర్చు’ అంటారు. అంటే ప్రజాప్రతినిధులు, కేంద్రప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, పాత అప్పులకు వడ్డీలు కట్టడం.. పేదలకు ఇచ్చే ఉచిత బియ్యం, ఎరువులు లాంటి రకరకాల సబ్సిడీలు, ఆర్మీ, రక్షణ సేవలు, విదేశాల్లో ఉన్న భారత రాయభార కార్యాలయాల నిర్వహణకు ఖర్చయ్యాయి.

క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్..

మిగిలిన 26 శాతం డబ్బును మాత్రం ప్రభుత్వం ‘క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్’ లేదా మూలధన ఖర్చు కింద ఉపయోగించింది. అంటే భవిష్యత్తులో మనకు ఉపయోగపడే కొత్త హైవేలు, రైల్వే లైన్లు, వంతెనల నిర్మాణానికి 6.54 లక్షల కోట్లను వెచ్చించింది. మొత్తానికి బడ్జెట్‌లో అనుకున్న ఆదాయం టార్గెట్‌లో ఇప్పటివరకు 50 శాతం పూర్తి కాగా.. ఖర్చుల్లో 47.7 శాతం పూర్తయింది.

Advertisement

Also read: ఎప్పుడైనా అరటి ఆకులో చికెన్ రోస్ట్ చేసి తిన్నారా? ఈ సండే పక్కా ట్రై చేయండి బాస్!

Tags

Related News

సీఎం సభ తరువాత కేటీఆర్‌ ఇలాఖాలో అభివృద్ధి పరుగులు! వేములవాడతో కలుపుకుని రూ. 345 కోట్ల పనులు! రామన్నా రాకున్నా ఆగని అభివృద్ధి!

హస్తినలో ఇండీ నిరసన గళాలు! హైదరాబాద్‌లో బీజేపీ బల ప్రదర్శనలు! అమిత్ షా రాకతో బీజేపీలో సందడి..! తెలంగాణపై షా స్పెషల్‌ ఫోకస్‌!

ఆప్ ను అందలమెక్కించిన ఢిల్లీ విద్యా విప్లవం..! సర్కారీ విద్యకు అత్యధిక ప్రాధాన్యం..! భారీ సంస్కరణలతో మంచి ఫలితాలు.. పంజాబ్ లో గెలుపుకీ దోహదం!

సర్కారీ విద్య బలోపేతానికి భారీ సిఫార్సులు! మియాపూర్ భూముల అమ్మకం సొమ్మును వినియోగించాలని సూచన..! తన మాటవింటే మళ్లీ గెలవటం పక్కా అంటున్న మురళి!

మూడు పార్టీలు.. మూడు స్కెచ్‌లు.. ఒక్కటే టార్గెట్!

ఎల్‌నినో దెబ్బకు చెక్.. అర్నబ్ తుపాన్‌తో నిండిన ఉత్తరాంధ్ర రిజర్వాయర్లు

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాలు అడుగుతున్నారని ప్రచారం! ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే ఆ పత్రాన్ని చూపిన కేటీఆర్‌..! సర్కార్‌ ఖండించినా ఆగని దుష్ప్రచారం!

Big Stories

Advertisement
×