E-Paper
Advertisement

‘ఇట్లు అర్జున’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా విడుదలకు మోక్షం దక్కేనా?

‘ఇట్లు అర్జున’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా విడుదలకు మోక్షం దక్కేనా?
Advertisement

Itlu Arjuna New Release Date: టాలీవుడ్ యువ నటుడు సాయి అనీష్ (Sai Aniesh), అందాల ముద్దుగుమ్మ అనస్వర రాజన్(Anaswara Rajan) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇట్లు అర్జున'(Itlu Arjuna). బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇదివరకే ప్రేక్షకుల ముందుకు విడుదల కావాల్సి ఉండగా ఆదర్శ కుటుంబం సినిమా కారణంగా తరచు వాయిదా పడుతూ వస్తుంది. అక్టోబర్ రెండో తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా వెంకటేష్ సినిమా కారణంగా అక్టోబర్ 9 కి వచ్చింది. ఇలా అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 30న విడుదల కాబోతున్నట్లు నిర్మాతలు ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

ఈసారైనా వస్తారా అర్జున..

ఇలా వరుసగా ఈ సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తున్నప్పటికీ ఆదర్శ కుటుంబం సినిమా కారణంగా తరచు వాయిదా వేస్తూ వచ్చారు. ఇకపోతే ఆదర్శ కుటుంబం సినిమా విడుదల కావడంతో ఇట్లు అర్జున సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా నవంబర్ 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. ఈ విధంగా ఈ సినిమా కొత్త విడుదల తేదీన ప్రకటించడంతో అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ ఇప్పటికైనా ఈ సినిమా విడుదలకు మోక్షం దక్కేనా? లేకుంటే మరే సినిమా కారణం చేత అయినా వాయిదా పడుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నిర్మాణ బాగస్వామ్యంలో నాగార్జున..

Advertisement

ఇక ఈ సినిమాకు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్, హ్యాష్ ట్యాగ్ మీడియా, వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నిర్మాణంలో కింగ్ నాగార్జున(Nagarjuna) కూడా భాగస్వామ్యం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. మరి నవంబర్ 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇట్లు అర్జున ఎలాంటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక ఈ సినిమా ప్రేమకథాచిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో అనీష్ మూగవాడి పాత్రలో నటించడం విశేషం.మాటలు లేకుండా, కేవలం సైగలు మరియు హావభావాల ద్వారానే తన ప్రేమను ఎలా వ్యక్తం చేస్తాడు అనేదే ఈ సినిమా కథ నేపథ్యం. ఇక ఈ సినిమాలో కీర్తి అనే పాత్రలో అనస్వర రాజన్ సందడి చేయబోతున్నారు. ఈ సినిమా ప్రేమ కథ సినిమా మాత్రమే కాకుండా ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న సినిమా అని, ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. మరి అక్టోబర్ 13న విడుదల కాబోతున్న ఇట్లు అర్జున ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Also Read: తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు!

Related News

ఒకే పాట.. ఇద్దరు స్టార్ సింగర్స్.. తెరవెనుక ఏం జరిగిందో చెప్పిన సంగీత దర్శకుడు!

ఆ హీరోతో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ఉందన్న పూజా హెగ్డే..ఆ కోరిక తీరేనా?

రామ్ చరణ్ హీరోయిన్‌గా అచ్చ తెలుగు అమ్మాయి.. సుకుమార్ గ్రీన్ సిగ్నల్?

‘ఐఫా అవార్డ్స్ 2026’లో సత్తాచాటిన ధురంధర్.. ఏకంగా 12 అవార్డ్స్!

ప్రకాష్ రాజ్ కు చేజారిపోతున్న సినిమా అవకాశాలు.. రాజకీయాలే కారణమన్న భార్య!

సినీ హిస్టరీలో కొత్త అధ్యాయం.. 70ఎంఎం స్క్రీన్ పై ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్!

సీఎం విజయ్ ఇంట విషాదం!

Big Stories

Advertisement
×