Anurag Kashyap: అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap)బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న అనురాగ ఇటీవల సెన్సార్ బోర్డు(censor board) పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉన్నాయి అంటూ ఈయన మండిపడ్డారు. ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), సురేష్ గోపి(Suresh Gopi) ప్రధాన పాత్రలలో నటించిన”జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ” (J.S.K) సినిమా విషయంలో సెన్సార్ వ్యవహరించిన తీరు పట్ల ఈయన స్పందించారు.
పాత్రలకు ఏం పేర్లు పెట్టాలి?
ఈ సినిమాలో కథానాయికి పాత్ర పేరు జానకి (Janaki)అయితే ఈ పేరు సీతమ్మ తల్లి పేరుతో అనుసంధానంగా ఉంది అంటూ సెన్సార్ ఆ పేరును మార్చాలని అభ్యంతరం తెలిపారు. ఈ ఘటన గురించి అనురాగ్ స్పందిస్తూ.. బతికున్న వ్యక్తుల పేర్లను పాత్రలకు ఎలాగో పెట్టలేము. ఇక పాత్రలకు పేర్లు పెట్టడానికి ఏం మిగిలిందని..పాత్రలకుXYZ, ABC,123 అని పెట్టుకోవాలా? అంటూ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.పాత్రలకు ఇంటిపేర్లు, డార్క్ షేడ్స్, నెగిటివ్ షేడ్స్ ఉన్న కూడా సమస్యేనని, ఇలాంటి సమస్యల కారణంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు కూడా రాలేకపోతున్నాయని తెలిపారు.
డిక్షనరీ తీసుకెళ్లాను..
ఇటీవల కాలంలో సమాజానికి మంచి సందేశం అందించే సినిమాలు చేయాలని చెబుతున్నారు. నిజానికి ఇలాంటి సినిమాలు సమాజాన్ని మార్చలేవని, మనం నిజాయితీగా సినిమాని చూపించడం ముఖ్యమని తెలిపారు. అదేవిధంగా ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా సెన్సార్ కార్యక్రమాలకు వెళ్లిన సమయంలో ఎంతో ఆందోళన చెందానని అందుకే డిక్షనరీ(Dictionary) కూడా తనతో పాటు తీసుకువెళ్లానని అప్పటి సంఘటనలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సెన్సార్ బోర్డులో పని చేసే చాలామందికి హిందీ సరిగా రాదని ఈయన తెలిపారు.
ఫోన్ కూడా అనుమతి లేదు…
నా మొదటి సినిమాని సెన్సార్ కోసం పంపిన సమయంలో అందులో ఒక పదం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మహారాష్ట్రలో సెన్సార్ బోర్డు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న వారికి హిందీ సరిగా తెలియకపోవడంతో ఆ పదం గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో ఆ పదానికి అర్థం తెలియచేయడం కోసం తాను డిక్షనరీ కూడా వెంట తీసుకువెళ్లానని ఈయన తెలిపారు. అయితే అప్పట్లో డిక్షనరీ తీసుకెళ్లడానికి అనుమతి ఉండేదని కానీ ఇప్పుడు సెన్సార్ రూల్స్ ప్రకారం కనీసం ఫోన్ కూడా లోపలికి తీసుకొని వెళ్లడానికి కూడా అనుమతి లేదు అంటూ ఈయన సెన్సార్ బోర్డుపై మండిపడ్డారు.ఇక అనుపమ పరమేశ్వరన్ నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా పేరు మార్చాలని సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతుందని చెప్పాలి. మరి ఈ విషయంలో చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
Also Read: Mallika Sherawat: ఆ హీరోలు రాత్రికి రమ్మని పిలిచేవారు.. కన్నీళ్లు పెట్టుకున్న మల్లికా షెరావత్!