BigTV English

Salman Khan: రూ. 5 కోట్ల ఆస్తి.. అంత తక్కువ ధరకే అమ్మేసిన సల్మాన్, ఎందుకో తెలుసా?

Salman Khan: రూ. 5 కోట్ల ఆస్తి.. అంత తక్కువ ధరకే అమ్మేసిన సల్మాన్, ఎందుకో తెలుసా?
Advertisement

Salman Khan Sells His Apartment : బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయనకు తరచూ హత్య బెదిరింపులు వస్తున్నాయి. అంతేకాదు పలుమార్లు ఆయన ఇంటి రెక్కీ వేసి కాల్పులు జరిపారు. అప్పటి నుంచి సల్మాన్ ఫుల్ సెక్యూరిటీ మధ్య ఉంటున్నారు. ముంబై ప్రభుత్వం ఆయన వై క్యాటగిరి సెక్యూరిటీని కల్పించింది. ఆయన ఎక్కడికి వెళ్లిన తన చూట్టూ భారీ భద్రత, గన్ మెన్స్ ఉండాల్సిందే. అలా సల్మాన్ లైఫ్ మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భాయిజాన్ సినిమా షూటింగ్స్ హాజరవుతున్నారు.


మరోసారి వార్తల్లో సల్మాన్

అలాగే బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకువెళుతున్నారు. అయితే తాజాగా సల్మాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి తన వ్యక్తిగత విషయంలో వైరల్ అవుతున్నారు. తాజాగా ఆయన తన రూ.5 కోట్ల ఆస్తిని అమ్మేశారట. అది కూడా అతి తక్కువ ధరకే. దీంతో ఈ అంశం ఇప్పుడు బి టౌన్ లో హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు అనే విషయం తెలిసిందే. అత్యధిక పారితోషికం తీసుకునేవారిలో ఆయన ముందున్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న భాయిజాన్ తన అపార్ట్మెంట్ ను అమ్మడం అందరిని సర్ప్రైజ్ చేస్తోంది.


ఆ ఆస్తి అమ్మేసిన భాయిజాన్

ఆరు పదుల వయసులోనూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచీలర్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఈ కండల వీరుడు. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద ఆయన సినిమాలేవి పెద్ద వర్కౌట్ అవడం లేదు. ఒకప్పుడు బాక్సాఫీసు ఏలిన ఆయన సినిమాలు ప్రస్తుతం వరుసగా బోల్తా పడుతున్నాయి. అయినా రెమ్యునరేషన్ మాత్రం భారీగానే అందుకుంటున్నారు. బాలీవుడ్ అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో సల్మాన్ టాప్ లో ఉంటారు. సినిమాలతోనే కాదు.. బిగ్ బాస్ ద్వారా కూడా భారీగానే రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. గత సీజన్ల వరకు రూ. 250 కోట్లు తీసుకునే ఆయన ఈ సారి కొత్త సీజన్ కి రూ. 300 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్వహకులు సైతం అంత ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఇలా ఆరు పదుల వయసులోనూ రెండు చేతుల వందల కోట్లు సంపాదిస్తున్న సల్మాన్.. ఆస్తీని అమ్ముకోవడం చర్చనీయాంశం అయ్యింది.

మరి అంత తక్కువ ధరకేనా..

అది కూడా ముంబైలోని ప్రీమియర్ ఏరియాగా పేరున్న బాంద్రాలోని అపార్ట్మెంట్ ను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శివ్ ఆస్తాన్ హైట్స్ లో ఉన్న 23,042 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన లగ్జరీ ఫ్లాట్ ను కేవలం రూ. 5.35 కోట్లకు అమ్మినట్టు సమాచారం. ఆ ఆస్తి విలువ రూ. 5 కోట్లు కాగా.. డాక్యుమెంటేషన్, స్టాంప్ డ్యూటీ చార్జీలు మొత్తం కలిపి సుమారు రూ. 33 లక్షలు అయినట్టు తెలుస్తోంది.కాగా గతంలో ఈ అపార్టుమెంట్ నుంచి ప్రతి నెల రూ. 90 లక్షల వరకు రెంట్ తీసుకునేవాడట. అలాంటి అపార్ట్మెంట్ ని కేవలం రూ. 5 కోట్లకే అమ్మడం అందరికి షాక్ కు గురిచేస్తోంది. అయితే ఈ ప్లాట్ కొన్ని అవసరాల నిమిత్తం అమ్మడా? లేక పురాతమైన ఈ అపార్టుమెంట్ ఎందుకు లే అని అమ్మేసారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైన వేల కోట్లు, వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సల్మాన్ భాయ్ బాంద్రాలోని ఈ లగ్జరీ అపార్టుమెంట్ అమ్మడం ప్రతి ఒక్కరికి షాకిస్తోంది.

Related News

Kiran Abbavaram: పవన్ సినిమాలలో అసలు నటించను…అభిమాని అయితే నటించాలా?

Samantha: డైరెక్టర్లు కూడా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. బోల్డ్ కామెంట్స్ చేసిన సమంత!

Hero Darshan: మళ్లీ సంకటంలో పడ్డ హీరో దర్శన్.. ఉన్నత న్యాయస్థానం మండిపాటు!

Hero Vishal: 8కోట్ల మంది ఇష్టాన్ని 8మంది నిర్ణయించలేరు..అవార్డులన్నీ చెత్తబుట్టలోకే!

K-Ramp: కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్!

Bandla Ganesh: నెక్స్ట్ అల్లు అర్జున్ అతడే.. ఈ మాత్రం హైప్ ఇస్తే చాలు..చెలరేగిపోవడమే!

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Big Stories

×