Alum For Wrinkles: అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి ?. ఈ రోజుల్లో అబ్బాయిలు అయినా, అమ్మాయిలు అయినా అందరూ అందంగా కనిపించడం కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అయినప్పటికీ కొన్ని సార్లు వయస్సు పెరిగే కొద్ది ముడతలు వస్తుంటాయి. దీంతో అందం కూడా తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ముడతలను వదిలించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల హోం రెమెడీస్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ముడతలు తక్కువ సమయంలో తగ్గించుకోవాలని అనుకునే వారు పటిక వాడితే అలవాటు చేసుకోవాలి. ఇది ముడతలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇంతకీ పటికను ముడతలు తగ్గడానికి ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పటిక అంటే ఏమిటి ?
పటిక అనేది సహజ ఖనిజం. ఇది ప్రాథమికంగా అల్యూమినియం సల్ఫేట్ రూపంలో లభిస్తుంది. దీనిని స్ఫటిక , పొడి రూపాల్లో కూడా ఉపయోగిస్తారు. ఎరుపు, తెలుపు అనే రెండు రకాల పటికలను మనం సాధారణంగా ఉపయోగిస్తుంటాం. చాలా ఇళ్లలో తెల్ల పటికను కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో.. దీనిని వివిధ రకాల చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు.
పటిక యొక్క ప్రయోజనాలు:
మొటిమల నివారణ:
పటికలో క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. అందుకే ఇది చిన్న చిన్న గాయాలు అంతే కాకుండా బ్యాక్టీరియాను చంపడం ద్వారా ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. ఈ లక్షణం మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది కాబట్టి.. మొటిమలకు గురయ్యే చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
చెడు వాసన:
పటికను సహజ దుర్గంధనాశనిగా కూడా ఉపయోగిస్తారు. శరీర దుర్గంధాన్ని కలిగించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా పటికను నేరుగా చర్మానికి కూడా అప్లై చేయవచ్చు. ఇది చెమటను విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియాను నివారించడం ద్వారా చెడు వాసనను తగ్గిస్తుంది.
ఎక్స్‌ఫోలియేషన్:
పటిక చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది సాంప్రదాయ స్క్రబ్ లేదా పీల్ లాగా కాకపోయినా, కొద్దిగా రుద్దడం వల్ల చనిపోయిన చర్మాన్ని వదిలించుకోవచ్చు. ఈ ప్రక్రియ చర్మాన్ని మృదువుగా , మెరిసేలా చేస్తుంది.
చర్మాన్ని బిగుతుగా చేయడం:
పటిక చర్మాన్ని తాత్కాలికంగా బిగుతుగా చేయడానికి సహాయపడుతుంది. దీని ఆస్ట్రిజెంట్ లక్షణాలు చర్మాన్ని కుదించి, మరింత దృఢంగా అంతే కాకుండా యవ్వనంగా కనిపించేలా కూడా చేస్తాయి. ఇది చక్కటి గీతలు, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: తక్షణ శక్తి కోసం ఎలాంటి డ్రింక్స్ తాగాలో తెలుసా ?
పటికను ఎలా ఉపయోగించాలి ?
– పటికను ముఖంపై ఉపయోగించే ముందు నీటిలో కరిగించడం ముఖ్యం. ఎందుకంటే ఇది చర్మంపై నేరుగా అప్లై చేసినప్పుడు కఠినంగా ఉంటుంది.
– తడి పటికను కూడా నేరుగా శరీరంపై రుద్దొచ్చు.
– ముఖానికి, రోజ్ వాటర్‌తో కలిపి పలుచని పేస్ట్ లాగా అప్లై చేయవచ్చు.
– మీరు పటికను నీటిలో కరిగించి సహజ టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు.
– ముఖంపై ముడతలను తగ్గించడానికి.. పటిక, గ్లిజరిన్ మిశ్రమాన్ని అప్లై చేస్తే.. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖంపై మొటిమలు తగ్గాలనుకునే వారు దీనిని వాడటం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు కూడా ఉంటాయి.