Ghaati Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుష్క గిరిజన మహిళ పాత్రలో నటిస్తుంది.. ఇప్పటివరకు విడుదలైన ఈ మూవీ అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.. ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని చాలామంది వెయిట్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. మొన్నటి వరకు ఈ నెల 11న థియేటర్లలోకి రాబోతుందని ప్రకటించారు మేకర్స్.. కానీ ఇప్పుడు కొన్ని కారణాలవల్ల ఆ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
‘ఘాటి’ వాయిదా.. మేకర్స్ క్లారిటీ..
అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఘాటి’ చిత్రం మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ మూవీ మరోసారి వెనక్కి వెళ్లడం ఫ్యాన్స్‌ని హర్ట్ చేస్తోంది.. ఈ విషయాన్ని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మూవీని పోస్ట్ పోన్ చేస్తున్న యువీ క్రియేషన్స్ అఫిషియల్ గా ప్రకటించారు.. ముందుగా జూలై 11 న సినిమా రిలీజ్ కాబోతుందని అనౌన్స్ చేశారు. అయితే ప్రమోషన్స్ ఎక్కడ మొదలు పెట్టకపోవడంతో ఈ సినిమా వాయిదా పడుతుందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్తలే నిజమని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు ఇవి క్రియేషన్స్ ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడ్డ ఈ సినిమాకు మరోసారి వాయిదా పడటంతో అనుష్క అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు హరిహర వీరమల్లుకు పోటీగా ఈ నెల 24న ఈ సినిమా రాబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.
Also Read: సినిమా వాయిదా.. వేణుస్వామితో పవన్ హీరోయిన్ ప్రత్యేక పూజలు..
వీరమల్లు తో ఘాటి పోటీ..?
డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించిన రెండు సినిమాలు ఒకేసారి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త అయితే నెట్టింట వైరల్ గా మారింది. క్రిష్ దర్శకత్వం వహించిన హరిహర వీరమల్లు సినిమా కూడా ఈ నెలలో విడుదల కాబోతుంది. అలాగే ఘాటి చిత్రం కూడా ఇదే నెలలో విడుదల కాబోతుందని అందరికీ తెలుసు.. అయితే రెండు సినిమాలు ఏ మాత్రం తగ్గకుండా భారీ బజ్ ని క్రియేట్ చేసుకున్నాయి. కొన్ని టెక్నికల్ కారణాలవల్ల ఈ సినిమాని పోస్ట్ ఫోన్ చేస్తున్నామంటూ ఘాటి మేకర్స్ ప్రకటించారు.. అయితే క్రిష్ మాత్రం తన రెండు సినిమాలను ఒకే రోజు వస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారట. అందుకు తగ్గట్లే బ్యాక్ గ్రౌండ్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అనుకున్న టైంలో అనుకున్నట్లే అన్ని జరిగితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి రాబోతున్న అంటూ ఇండస్ట్రీలో టాక్.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాలి..
Team #GHAATI pic.twitter.com/UhUtWuMR6g
— UV Creations (@UV_Creations) July 5, 2025