OTT Movie : టీనేజ్ వయసులో కంట్రోల్ లేకపోతే వచ్చే పరిణామాలు మాటల్లో చెప్పలేము. జీవితాలను ప్రభవితం చేసే ఆ ఏజ్ లో కొంత మంది గైడెన్స్ సరిగ్గా లేక మరీ దారుణంగా తయ్యారవుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో స్టోరీ హెచ్ఐవి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలోకి వెళితే.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ డ్రామా మూవీ పేరు ‘కిడ్స్’ (Kids). 1995లో విడుదలైన ఈ సినమాకి లారీ క్లార్క్ దర్శకత్వం వహించాడు. హార్మొనీ కొరిన్ రాసిన స్క్రీన్‌ప్లేతో రూపొందింది. ఇందులో లియో ఫిట్జ్‌పాట్రిక్ (టెల్లీ), జస్టిన్ పియర్స్ (కాస్పర్), క్లోయి సెవిగ్నీ (జెన్నీ), రోసారియో డాసన్ నటించారు. ఈ చిత్రం న్యూయార్క్ నగరంలో ఒక రోజు టీనేజర్ల జీవితాన్ని, వాళ్ళ ప్రమాదకరమైన ప్రవర్తనను చూపిస్తూ, హెచ్‌ఐవీ సమస్యలపై దృష్టి సారిస్తుంది. ఇది దాని బో*ల్డ్ కంటెంట్ కారణంగా ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. 1 గంట 30 నిమిషాల రేటింగ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.0/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
టెల్లీ అనే టీనేజర్, 12 ఏళ్ల జెన్నీఅనే వర్జిన్ అమ్మాయితో ఏకాంతంగా గడుపుతాడు. తన ‘వర్జిన్స్‌ను డీ-ఫ్లవర్’ చేయాలనే లక్ష్యంతో అతను ముందుకు సాగుతాడు. అతను, తన స్నేహితుడు కాస్పర్ తో కలసి న్యూయార్క్ వీధుల్లో స్కేటింగ్ చేస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ, దొంగతనం చేస్తూ, అమ్మాయిలను మోసం చేస్తూ సమయం గడుపుతారు. ఇదే సమయంలో, జెన్నీ తనకు హెచ్‌ఐవీ పాజిటివ్ అని తెలుసుకుంటుంది. ఆమె ఒక్కసారి మాత్రమే టెల్లీతో గడిపింది. కాబట్టి అతనే ఆమెకు హెచ్‌ఐవీ సంక్రమించినవాడని గ్రహిస్తుంది. జెన్నీ టెల్లీని కనిపెట్టి, అతన్ని మరొక అమ్మాయితో సెక్స్ చేయకుండా ఆపాలని అతన్ని వెతుకుతుంది. టెల్లీ, కాస్పర్ ఒక ఇంట్లో జరిగే పార్టీకి వెళతారు. అక్కడ డ్రగ్స్. ఆల్కహాల్‌తో అందరూ మునిగిపోతారు. ఇక జెన్నీ ఎలాగో కష్టపడి ఆ పార్టీకి చేరుకుంటుంది. కానీ డ్రగ్స్ వల్ల మైకమెక్కి సోఫాలో నిద్రపోతుంది. ఆ సమయంలో కాస్పర్, తాగిన మైకంలో, జెన్నీకి హెచ్‌ఐవీ సోకిన విషయం తెలియకుండా గడుపుతాడు. చివరికి జెన్నీకి నిజంగానే హెచ్‌ఐవీ సోకుతుందా ? ఆమె ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ? టెల్లీ, కాస్పర్ పరిస్థితి ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ అమెరికన్ డ్రామా సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : స్పేస్ క్రాఫ్ట్ పేలుడు… దాని ఒక్కో ముక్కతో భూమిపై ఒక్కో వినాశనం… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్