Venuswamy: సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అంతేకాదు హీరోయిన్లతో హీరోలతో పూజలు చేయిస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఒక్కసారిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆయనతో పూజలు చేయించుకున్న తర్వాత కొందరు లైఫ్ మారిందని నమ్ముతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లు ఆయనతో పూజలు చేయించుకోవడానికి వరుసగా క్యూ కడుతున్నారు. రష్మిక మందన్న అలాంటి స్టార్ హీరోయిన్లు సైతం పూజలు చేయించుకోవడంతో ప్రతి ఒక్కరూ అదే బాటపడుతున్నారు. తాజాగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వేణు స్వామి ఇంటికి సెలబ్రిటీలు క్యూ..
సెలబ్రెటీ జ్యోతిష్యుడుగా పాపులర్ అయిన వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రెటీల కెరీర్, వ్యక్తిగత జీవితాలపై జోస్యాలు చెబుతూ ఫేమస్ అయ్యారు. తెలుగు స్టార్ హీరో హీరోయిన్లయినా నాగచైతన్య సమంత విడిపోతారని చెప్పినా మాట నిజమైంది అప్పటినుంచి ఆయనను నమ్మడం మొదలైంది. ఆ తర్వాత హీరోయిన్లతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఆయన ఇంటి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన చేత పూజల చేయించుకున్న హీరోయిన్లు, ఇతర సెలబ్రెటీలు టాప్ పొజిషిన్‌కు వెళ్లడంతో వేణుస్వామిపై గురి బాగా కుదిరింది. అయితే ఏపీ, తెలంగాణ ఎన్నికలు, ప్రభాస్ ఆరోగ్యం, ఇండియా – పాకిస్తాన్ యుద్ధం తదితర విషయాలపై ఆయన జోస్యం రివర్స్ కావడంతో ట్రోలింగ్ జరిగింది. కానీ ఆయనతో పూజలు చేయించుకోవడం మాత్రం ఆగడం లేదు. మొన్న బిగ్ ఇందాక మొన్న బిగ్ బాస్ బ్యూటీ ఆయనతో పూజలు చేయించుకుంది స్ బ్యూటీ ఆయనతో పూజలు చేయించుకుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ ఆయనతో పూజలు చేయించుకున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read:ఆదివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..
వేణు స్వామితో నిధి పూజలు..
టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ వేణుస్వామి ఇంట్లో ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్‌గా మారింది. రెండేళ్ల క్రితం కూడా వేణుస్వామితో పూజలు చేయించారు నిధి. ఆమె కెరీర్ బాగా ముందుకు వెళ్లాలని, ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు నిధి ఈ పూజలు చేయించారు. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోల సినిమాలలో ఛాన్సులు అందుకుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరముల సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. అదేవిధంగా ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు షూటింగులు పూర్తి చేసుకునే కానీ విడుదల తేదీ మాత్రం వాయిదా పడుతూ వస్తున్నాయి. అరియర్ వీరమల్లు ఈనెల 24న థియేటర్లలో సందడి చేయబోతుంది. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించాలని ఈ అమ్మడు ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
?igsh=MTlqbnl2a2wzcjB6Yg==