BigTV English

Anushka Shetty: అనుష్క మార్కెట్ రూ. 25 కోట్లలోపే… యంగ్ హీరోయిన్ బెటర్ కదా..

Anushka Shetty: అనుష్క మార్కెట్ రూ. 25 కోట్లలోపే… యంగ్ హీరోయిన్ బెటర్ కదా..

Ghaati Movie Pre Release Business: స్వీటీ అనుష్క లాంగ్‌ గ్యాప్ తర్వాత ఘాటీ మూవీతో ఫ్యాన్స్‌ని పలకరించేందుకు వస్తోంది. చివరిగా ‘మిస్టర్‌ శెట్టి-మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమాలో నటించింది. యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టితో జతకట్టింది. అయితే హీరోయిన్లలో అనుష్క శెట్టికి ఉండే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వేరు. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకుంది. తెలుగు హీరోయిన్లను ఆమె లేడీ సూపర్‌ స్టార్‌గా గుర్తింపు పొందింది. అనుష్క సినిమాల్లో హీరోలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. అవి బాహుబలిలో చూశాం. అలా తెలుగులో అనుష్క ఎంతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. అయితే భాగమతి తర్వాత అనుష్క వెండితెరకు చాలా అరుదుగా కనిపిస్తోంది.


ఘాటీని వెంటాడుతున్న రిలీజ్ కష్టాలు..

ఇక నటనకు గుడ్‌బై చెప్పేసిందా? అని అనుకుంటున్న టైంలో మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి చిత్రంతో వెండితెరపై మెరిసింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక అనుష్క బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తుందని, ఇక వెండితెరపై ఆమె సందడిని ఎవరూ ఆపలేరు అనుకున్నారు. ఈ సినిమా వచ్చి మూడేళ్లపైనే అవుతోంది. కానీ ఇంతవరకు ఆమె సినిమా విడుదల కాలేదు. చాలా గ్యాప్ తీసుకుని ఘాటీ సినిమాను ప్రకటించింది. కానీ, ఈ చిత్రం విడుదలకు వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం తరచూ వాయిదా పడుతోంది. ఇక అన్నిఅడ్డంకులు దాటేసి ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న థియేటర్లోకి రాబోతోంది. దీంతో మూవీ టీం మెల్లిమెల్లిగా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది. ఇటీవల ట్రైలర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. దాంతో ఘాటీ చిత్రంపై అంచనాలు మరిన్ని పెరిగాయి.


ప్రీ రిలీజ్ బిజినెస్ మరి అంతేనా..!

ఇక సినిమా విడుదల కొన్ని రోజులే ఉండటంతో పోస్ట్‌ ప్రొడోక్షన్‌ వర్క్‌తో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా జరుపుకుంటుంది. అయితే ఘాటీ ప్రీ రిలీజ్ బిజినెస్ కనీసం రూ. 30 కోట్లు కూడా చేయడం లేదట. ఈ సినిమాకు బయ్యర్లు బేరాలు ఆడుతున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల అయితే ఇంతే ఇస్తామంటూ మొండి చేస్తున్నారట. దీంతో అనుష్క ఘాటీ మూవీని కొనేందుకు బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపించనట్టు కనిపిస్తున్నారట. అనుష్క లాంటి నటి మూవీకి ఇలాంటి పరిస్థితులు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఘాటీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ చూస్తుంటే యంగ్‌ హీరోయిన్లు బెటర్‌ కదా అంటున్నారు. ఇప్పటి వరకు ట్రేడ్‌ వర్గాల నుంచి వినిపిస్తున్న లెక్కలు చూస్తుంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ కనీసం రూ. 25 కోట్లు కూడా దాటడం లేదట.

ట్రేడ్‌ వర్గాల ప్రకారం ఘాటీ ప్రీ రిలీజ్ లెక్కలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర మొత్తానికి రూ. 10 కోట్లు చెబుతున్నారు నిర్మాతలు. కానీ దీనికి బయ్యర్లు నెగోషియేషన్‌ చేస్తున్నారట. సీడెడ్‌, నైజాం ఏరియాల్లో కలిపి రూ. 12 కోట్లు చెప్పారట. కానీ ఇక్కడ కూడా ఈ మూవీకి బేరాలు ఆడుతున్నారట. ఓవర్సిస్‌లో రూ. 2 కోట్ల ంకటే ఎక్కువ అవ్వడం లేదట. మిగితా రాష్ట్రాలు కలిపి ఒక కోటీ రూపాయలు అటు ఇటుగా చెబుతున్నారట. ఈ లెక్కల ప్రకారం చూస్తుంటే ఘాటీ మూవీని నమ్మి.. నిర్మాత అడిగినంత పెట్టేందకు బయ్యర్లు వెనకాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్‌ కష్టాలను దాటుకున్న ఈ సినిమా ఇప్పుడు బిజినెస్‌ కష్టాలు రావడం స్వీటీ ఫ్యాన్స్‌ ఆందోళన కలిగిస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందింది. రాజీవ్ రెడ్డి, సాయి బాబా జాగర్లమూడిలు దాదాపు రూ. 45 కోట్ల బడ్జెట్‌తో ఘాటీ చిత్రాన్ని తెరెక్కించారు.

Also Read: Heroine: ఆ ఎమ్మెల్యే హోటల్‌కి రమ్మంటున్నాడు.. హీరోయిన్‌ సంచలన ఆరోపణలు

Related News

Tollywood Films: స్ట్రైక్ ఎండ్ అయితే సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా ఉన్న సినిమాలివే

Keerthy Suresh: Ai తెచ్చిన తంటా, ఏకంగా మహానటికే బట్టలు లేకుండా చేశారు

Mega Blast Glimpse : విశ్వంభర గ్లిమ్స్ అవుట్, ఇక ట్రోలింగ్ కు ఆస్కారమే లేదు

Tvk Mahanadu : TVK మహానాడు లో తొక్కిస‌లాట… స్పాట్ లోనే 400 మంది?

Thalapathy Vijay : విఎఫ్ఎక్స్ లేదు, సిజి లేదు. విచ్చలవిడిగా జనం

Big Stories

×