BigTV English
Advertisement

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం.. అన్నింటికి కారణం కేసీఆరే: సీఎం రేవంత్

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం.. అన్నింటికి కారణం కేసీఆరే: సీఎం రేవంత్

Kaleshwaram Commission: సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కాళేశ్వరం కమిషన్‌ ఇచ్చిన నివేదికపై చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇచ్చిన నివేదికపై కేబినెట్ భేటీలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ కూడా ఇచ్చారు. ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ.. 650 పేజీల కాళేశ్వరం నివేదికను 60 పేజీల సారాంశంతో కీలక అంశాలను పొందుపరిచింది. మంత్రి వర్గానికి సమర్పించిన ఈ సంక్షిప్త నివేదికలో 32 సార్లు కేసీఆర్‌, 19 సార్లు హరీశ్‌రావు, 5 సార్లు ఈటల రాజేందర్ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.


రీడిజైనింగ్ పేరుతో కేసీఆరే డిజైన్లు మార్చారు…

‘రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ డిజైన్లను మార్చారు.. ప్రాజెక్ట్ నిర్మించిన మూడేళ్ల లోపే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ప్రాణిహిత చేవేళ్లను ప్రారంభించారు. ప్రాజెక్ట్ నిర్మించిన మూడేళ్లలోపే మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్లలో కూడా లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ లోపాలు ఉన్నాయని తేలింది. అవినీతి, ఆశ్రిత, పక్షపాతంలో ప్రాజెక్టును నిర్మించారు. ఎన్నికలకు ముందే దీనిపై విచారణ చేయిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


ALSO READ: Minister Uttam: చేసిందంతా కేసీఆరే.. ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ డిజైన్ మార్చేశారు: మంత్రి ఉత్తమ్

నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తాం…..

‘కమిషన్ చైర్మన్ గా వ్యవహరించిన పీసీ ఘోష్ నిబద్ధత గల వ్యక్తి. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా అనేక మంది అధికారులను ఘోష్ విచారించారు. 16 నెలల అనంతరం 665 పేజీల నివేదికను సమర్పించారు. కమిటీ రిపోర్ట్ అధ్యయనానికి ముగ్గురు అధికారులతో కమిటీ వేశాం.. ఊరు, పేరు అంచనాలు మార్చి అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చించబోతున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ALSO READ: Guvvala Balaraju: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా..

ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా అభిప్రాయపాలు చెప్పవచ్చు…..

‘అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటాం..అందరి ఆమోదం మేరకు ఏం చేయాలో నిర్ణయిస్తాం.. ఇది ఓ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదు.. కమిషన్ నివేదికను కేబినెట్ లో చర్చించి ఆమోదించాం. అందరి ఆమోదం మేరకు ఏం చేయాలో నిర్ణయిస్తాం.. ఇది ఓ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదు.. కమిషన్ నివేదికను కేబినెట్ లో చర్చించి ఆమోదించాం. ప్రజా ప్రతినిధులకు కమిషన్ నివేదిక ఇస్తాం. అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పవచ్చు. మాజీ సీఎం కేసీఆర్ అభిప్రాయాలను కూడా కోరుతాం’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ కేసీఆరే.. అలాగే డిజైన్లు కూడా ఆయన మార్చడంతో.. ఆయన జైలుకెళ్లడం తప్పదని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు చర్చించుకుంటున్నారు.

Related News

Jubileehills Bypoll: జూబ్లీహిల్స్ తెరపైకి జనసేన.. టీడీపీ మౌనం కాంగ్రెస్ కి లాభమేనా?

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Say No to Drug: ‘సే నో టు డ్రగ్స్’ పేరుతో రాష్ట్రంలో క్రికెట్ టోర్నమెంట్.. ప్రైజ్ మనీ అక్షరాల రూ.80 లక్షలు

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Jubilee Hills: ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ మాత్రమే లౌకిక పార్టీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills By-election: ఈ నెల 11 లోపు కేసీఆర్, హరీష్ రావులను సీబీఐ అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Hyderabad: గన్‌తో బెదిరింపులు.. మాజీ డిప్యూటీ సీఎం వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. అసలేంటి ఈ గొడవ

Big Stories

×