Renuka Swamy Murder Case: ప్రముఖ సినీ నటుడు దర్శన్ (Darshan) అభిమాని చిత్రదుర్గ రేణుకాస్వామి (Renuka swamy) హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. ఈ హత్యకు కారణమైన పవిత్ర గౌడ (Pavitra Gowda) ఏ1 గా, దర్శన్ ఏ2 గా ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. అయితే రేణుకా స్వామి హత్య కేసులో అప్రూవర్ గా మారిన ప్రదోష్ రావు (Pradosh Rao) విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ముఖ్యంగా రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హింసించి మరీ చంపినట్లు ఆయన చెప్పిన నిజాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
అప్రూవర్ గా మారిన ప్రదోష్ రావు అభిప్రాయాలను కోర్టు ఆలకించింది.” నీ భార్యకు మెసేజ్ చేస్తే మౌనంగా ఉంటావా?” అంటూ నటుడు దర్శన్ తన సహచరుడు నాగరాజును దూషించి, రేణుకా స్వామి పై దాడి చేశారని ఆయన వివరించారు. 59వ సిటీ సివిల్ సెషన్ కోర్టులో రేణుకా స్వామి హత్యకు సంబంధించిన అంశాలను సమగ్రంగా వివరించారు. రేణుకా స్వామి పై దర్శన్ ఇష్టారాజ్యంగా దాడి చేశారు. ప్యాంటు విప్పించి మర్మాంగంపై తన్నారు. నేలపై ఉమ్మి దానిని నాకాలని సూచించారు . దాడి జరిగిన సమయంలో దర్శన్ ఎలా వ్యవహరించారు అనే ప్రతి విషయాన్ని ఆయన వివరించినట్లు సమాచారం.
ఇక సహచరుడు నాగరాజు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. దర్శన్ చాలా తీవ్రంగా కోపడ్డారని , ఆ తర్వాత రేణుకా స్వామి ముఖానికి పంచ్ కట్టారని ప్రదోష్ రావు వివరించారు. ఇకపోతే ప్రదోష్ రావు చెబుతున్న ఊహించని నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే దర్శన్ రేణుకా స్వామి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించారా? అంటూ అందరూ నివ్వెరపోతున్నారు. ఏది ఏమైనా రేణుకా స్వామి హత్య కేసులో రోజుకో నిజం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రముఖ సినీ నటుడు దర్శన్, పవిత్ర గౌడతో రిలేషన్ పెట్టుకోవడం నచ్చని దర్శన్ అభిమాని రేణుకా స్వామి సోషల్ మీడియా ఖాతా ద్వారా పవిత్ర గౌడ కు అసభ్యకర మెసేజ్లు పంపించడంతో కోపోద్రిక్తురాలు అయిన ఆమె దర్శన్ తో పాటు పలువురితో కలిసి రేణుక స్వామిని అత్యంత దారుణంగా హత్య చేయించింది. సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకర కామెంట్లకే ఆమె హత్య చేయించడం సంచలనం సృష్టించింది . ముఖ్యంగా సినీ నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న దర్శన్ ఈ కేసులో ఏ 2గా నిలవడం, ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మీ మేలుకోరి అభిమాని చెబితే ఆయనను ఏకంగా హత్య చేస్తారా అంటూ దర్శన్ పై మండిపడ్డారు. ఇక గత ఏడాదికాలంగా దర్శన్, పవిత్ర రేణుకా స్వామి హత్య కేసులో వూసలు లెక్కబెడుతున్నారు.
also read: తత్వం మూవీ రివ్యూ.. ఈ సస్పెన్స్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
ఇకపోతే రేణుకా స్వామి హత్య కేసులో ఏ వన్ గా నిలిచిన పవిత్ర గౌడ జైలులో ఉండలేనని , నైజీరియన్ ఖైదీల ద్వారా తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బెయిల్ అయినా ఇవ్వండి లేదా విషమిచ్చి చంపేయండి అంటూ ఇటీవల కోర్టును ఆశ్రయించింది.