E-Paper
Advertisement

తత్వం మూవీ రివ్యూ.. ఈ సస్పెన్స్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?

తత్వం మూవీ రివ్యూ.. ఈ సస్పెన్స్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
Advertisement

చిత్రం: తత్వం
నటీనటులు: దినేష్ తేజ్, దాస్విక కింతాలి, సుక్కు రెడ్డి, ఆనంద్ భారతి, జబర్దస్త్ కృష్ణ , భోగి రెడ్డి శ్రీనివాస్, ప్రమోదిని తదితరులు
సినిమాటోగ్రఫీ: భరత్ పట్టి
ఎడిటర్‌: విప్లవ నైషధం
నిర్మాత: ఎస్.కె ప్రొడక్షన్, త్రయాతి ఇషానీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ సీమ కృతి నిర్మించారు
రచన, దర్శకత్వం: అర్జున్ కోలా
సంగీత దర్శకులు: చైతన్ భరద్వాజ్

Tatvam Movie Review : సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు అర్జున్ కోలా దర్శకత్వంలో వచ్చిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ ‘తత్వం’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకర్షణీయమైన టైటిల్ ట్యాగ్‌తో పాటు, ఇటీవల థ్రిల్లర్ జోనర్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా ఈ చిత్రంపై విడుదలకు ముందే మంచి బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ అంచనాలను ఏ మేరకు రీచ్‌ అయిందో ఈ రివ్యూలో చూద్దాం

తత్వం సినిమా కథ:

Advertisement

కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎస్సై కావాలనేది కళ్యాణ్ (దినేష్ తేజ్) లక్ష్యం. ఎస్సై పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి చూపుల కోసం రామాపురం గ్రామానికి వెళ్తాడు. అక్కడ సౌమ్య (దష్విక)ను చూసి మనసుపడతాడు. అదే గ్రామంలో వ్యవసాయం చేసుకునే మూర్తి, నాగమణి దంపతులు అనుమానాస్పద రీతిలో హత్యకు గురవుతారు. వారికి మానసిక సమస్యలున్న సుధ అనే కుమారుడు ఉండటంతో అందరూ అతనే చేశాడనే అపోహలో పడతారు. ఈ కేసును ఛేదించే బాధ్యతను కల్యాణ్ తన చేతుల్లోకి తీసుకుంటాడు. అసలు హంతకుడు ఎవరూ? సౌమ్య రింగ్ అక్కడ ఎందుకు దొరికింది? వంటి ఆసక్తికర మలుపులతో కథ సాగుతుంది.

తత్వం సినిమా విశ్లేషణ:

సమాజంలో చిన్న అపోహలు, అనుమానాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే ఒక చక్కటి పాయింట్‌ను దర్శకుడు అర్జున్ కోలా ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌లో టచ్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో మర్డర్ మిస్టరీని రివీల్ చేసే విధానం, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంటాయి. దినేష్ తేజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ఎనర్జిటిక్‌గా నటించారు. విజువల్స్ మరియు నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో డైరెక్టర్ ఆలోచన విధానం కొత్తగా అనిపిస్తుంది.

తత్వం ప్లస్ పాయింట్లు:

Advertisement

దినేష్ తేజ్ , దాస్వికల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, అభినయం
ఎంచుకున్న డిఫరెంట్ క్రైమ్ మిస్టరీ కాన్సెప్ట్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (కొన్ని సన్నివేశాల్లో బాగుంది)
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కొన్ని ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్

తత్వం మైనస్ పాయింట్లు:

సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే మరింత బిగువుగా ఉంటే బాగుండేది
కొన్ని కీలక సన్నివేశాలను మరింత భావోద్వేగంగా మలచవచ్చు

చివరి అఖరి మాటగా:

సస్పెన్స్ థ్రిల్లర్స్, వైవిధ్యమైన క్రైమ్ కథలను ఇష్టపడేవారికి ‘తత్వం’ ఒక మంచి ప్రయత్నంగా నిలుస్తుంది.

Tatvam Movie Review: 2.75/5

also read: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ రివ్యూ.. కార్తికేయ నిర్మాతగా సక్సెస్ కొట్టారా?

Related News

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ రివ్యూ.. కార్తికేయ నిర్మాతగా సక్సెస్ కొట్టారా?

‘డోరతీ’ మూవీ రివ్యూ.. కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

The Paradise Review : ‘ది ప్యారడైజ్’.. నాని కొత్త ప్రయోగం ఏమైందంటే?

ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ..నాని ఖాతాలో హిట్టు పడినట్టేనా?

సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ…

సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

టైటిల్ మాత్రమే ‘ఎపిక్’.. సెకండ్ హాఫ్ అంతా ‘ట్రాఫిక్’!

Big Stories

Advertisement
×