E-Paper
Advertisement

లేటెస్ట్ వాషింగ్ మెషీన్లు..ఆటో రీస్టార్ట్ ఫీచర్‌తో అదుర్స్!

లేటెస్ట్ వాషింగ్ మెషీన్లు..ఆటో రీస్టార్ట్ ఫీచర్‌తో అదుర్స్!
Advertisement

Auto restart washing machine: ఇంట్లో బట్టలు నాన బెట్టి వాషింగ్ మెషీన్ ఆన్ చేశారో లేదో.. టప్ మని కరెంట్ పోతుందా? ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. మళ్లీ కరెంట్ వచ్చాక.. మొదటి నుంచి సెట్టింగ్స్ మార్చుకోవడం పెద్ద తల నొప్పిగా మారుతుంది. అందుకే.. తరచూ పవర్ కట్స్ ఉండే ప్రాంతాల వారి కోసం ప్రముఖ బ్రాండ్లు ‘ఆటో-రీస్టార్ట్’ ఫీచర్‌తో అద్భుతమైన టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లను తీసుకొచ్చాయి. కరెంట్ ఎప్పుడు పోయినా పర్వాలేదు.. మళ్లీ రాగానే మెషీన్ ఎక్కడైతే ఆగిపోయిందో సరిగ్గా అక్కడి నుంచే.. మళ్లీ స్టార్ట్ అవుతుంది! సెప్టెంబర్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం అందుబాటులో.. ఉన్న బెస్ట్ ఆటో-రీస్టార్ట్ వాషింగ్ మెషీన్లు ,వాటి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ ఆటో-రీస్టార్ట్ వాషింగ్ మెషీన్లు: 

1.LG 8 kg Fully Automatic Washing Machine:

మార్కెట్లో ప్రస్తుతం హాట్ కేకులా అమ్ముడవుతున్న మోడల్స్ లో ఇది టాప్. పవర్‌ ఫుల్ స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీతో .. పాటు పవర్ రెజ్యూమ్ ఫీచర్ దీని ప్రత్యేకత. కరెంట్ కట్ అయితే.. మెషీన్ ఆగి పోతుంది. పవర్ రాగానే ఆటోమేటిక్‌గా.. అదే సైకిల్‌ను కంటిన్యూ చేస్తుంది.

Advertisement

ధర: సుమారు రూ.23,190 వరకు ఉంది.

2.Samsung 7 kg/8 kg Top Load Washing Machine:

సాంసంగ్ ఎకోబబుల్ టెక్నాలజీతో.. బట్టలను చాలా శుభ్రంగా ఉతుకుతుంది. ఇందులో.. ఉన్న డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ కరెంట్ బిల్లును భారీగా ఆదా చేస్తుంది. పవర్ కట్ అయినప్పుడు మెషీన్ మెమరీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి..కరెంట్ రాగానే ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి మిగిలిన వాషింగ్ ప్రాసెస్‌ను పూర్తి చేస్తుంది.

Advertisement

ధర: సామర్థ్యాన్ని బట్టి రూ.17,000 నుంచి రూ.21,000 వరకు లభిస్తుంది.

3.Godrej 7 kg Fully Automatic Washing Machine:

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే.. వారికి గోద్రెజ్ ‘ఆటో-రెజ్యూమ్’ మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్. తరచూ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్, పవర్ కట్స్ ఉండే ఏరియాల కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. లో వాటర్ ప్రెషర్ ఉన్న ప్రాంతాల్లోనూ ఇది అద్భుతంగా పని చేస్తుంది.

ధర: దాదాపు రూ.13,760 వరకు ఉంటుంది.

4.Whirlpool 7 kg/8 kg Washing Machine:

క్వాలిటీకి మారుపేరైన విర్ల్‌పూల్ వాషింగ్ మెషీన్లు పవర్ కట్ ఇబ్బందులను చిటికెలో పరిష్కరిస్తాయి. బట్టలపై.. ఎలాంటి మరకలు ఉండకుండా శుభ్రం చేయడంతో పాటు.. ఇది పవర్ కట్ సమయంలో మెషీన్ సేఫ్టీకి.. పూర్తి భరోసా ఇస్తుంది.

ధర: సుమారు రూ. 18,990 వరకు లభిస్తుంది.

Also Read: ఛార్జర్‌లపై ఉండే.. 5V, 9V, 12V అర్థం ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

5.Panasonic 7 kg/8 kg 5 Star Washing Machine:

జపాన్ టెక్నాలజీతో తయారయ్యే పనాసోనిక్ వాషింగ్ మెషీన్లు అద్భుతమైన క్వాలిటీ కలిగి ఉంటాయి. ఇందులో పవర్ ఫుల్ ఆటో-రీస్టార్ట్ ఫీచర్ ఉండటం వల్ల కరెంట్ పోయి వచ్చిన తర్వాత మళ్లీ మొదటి నుంచి వాషింగ్ సెట్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఆగిపోయిన దశ నుంచే.. ఇది తిరిగి పని చేయడం ప్రారంభిస్తుంది. తక్కువ నీటి ఒత్తిడిలోనూ.. సమర్థవంతంగా పని చేయడం దీని ప్రత్యేకత.

ధర: రూ.16,500 నుంచి రూ.19,500 వరకు లభిస్తుంది.

6.IFB 7 kg / 8 kg Washing Machine:

ఐఎఫ్‌బి బ్రాండ్ వాషింగ్ మెషీన్లు లేటెస్ట్ వాషింగ్ టెక్నాలజీకి పేరు గాంచాయి. తరచూ పవర్ కట్స్, వోల్టేజ్ హెచ్చు తగ్గులు ఉండే.. ప్రాంతాల కోసం ఇందులో ప్రత్యేకమైన పవర్ ప్రొటెక్షన్, ఆటో-రెజ్యూమ్ ఫీచర్లను పొందు పరిచారు. కరెంట్ కట్ సమయంలో.. మెషీన్ బోర్డు సురక్షితంగా ఉండటంతో పాటు, పవర్ రాగానే ఆటోమేటిక్‌గా తన సైకిల్‌ను కంటిన్యూ చేస్తుంది.

ధర:సుమారు రూ. 21,000 నుంచి రూ.24,500 వరకు ఉంటుంది.

Related News

ఎయిర్‌టెల్ vs వీఐ.. ఒకే ధరకు రూ.3,999 వార్షిక ప్లాన్.. ఏది రీఛార్జ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్?

BSNL సంచలన ఆఫర్.. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగా ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు ఇవే!

కాలేజ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్స్.. ఏది కొంటే బెటర్?

మోటో, ఒప్పో, ఐఫోన్ లవర్స్‌కి పండగే పండగ.. ఏ ఫోన్ ఎంత తక్కువకొస్తుందో తెలిస్తే షాకే!

యాపిల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది.. iPhone Duo సేల్ డేట్ ఇదే!

రూమ్‌లో డీజే మోగించాలా? అయితే ఈ అమెజాన్ ఆఫర్స్ అసలు మిస్సవ్వొద్దు

అమెజాన్ సేల్‌లో సగం ధరకే ప్రీమియం ట్యాబ్స్..ఆపర్ ముగిసేలోపే కొనేయండి

Big Stories

Advertisement
×