E-Paper
Advertisement

ఉరిశిక్షలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా చనిపోని మహిళ, చివరకు ఏం చేశారంటే?

ఉరిశిక్షలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా చనిపోని మహిళ, చివరకు ఏం చేశారంటే?
Advertisement

Shocking Execution Twist: మరణశిక్ష అంటే.. దోషి పని అయిపోయినట్టే అనుకుంటాం. కానీ, అమెరికాలో జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. శిక్ష అమలు చేయడానికి రెండు సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చినా.. ఖైదీ చనిపోలేదు. పైగా శ్వాస తీసుకుంటూ, గురక పెడుతూ ఉండటంతో అధికారులు ఏం చేయాలో తెలియక మరణశిక్షణకు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ అనూహ్య ఘటన అమెరికాలోని టెన్నెసీలో చోటుచేసుకుంది.

1995 హత్య కేసులో మరణశిక్ష!

టెన్నెసీకి చెందిన క్రిస్టా గెయిల్ పైక్ 1995లో జరిగిన 19 ఏళ్ల కొలీన్ స్లెమ్మర్ హత్య కేసులో దోషిగా తేలింది. అప్పటికి పైక్ వయసు కేవలం 18 ఏళ్లు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత ఆమెకు మరణశిక్ష ఖరారైంది. సెప్టెంబర్ 30, 2026న ఆమెకు శిక్ష అమలు చేయాలని అధికారులు సిద్ధమయ్యారు. టెన్నెసీ చరిత్రలో రెండు శతాబ్దాలకు పైగా తర్వాత ఒక మహిళకు మరణశిక్ష అమలు చేయబోతుండటంతో ఈ కేసు ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. అయితే, చివరకు అసలు ఊహించని ట్విస్ట్ అక్కడే మొదలైంది.

రెండు ఇంజెక్షన్లు ఫెయిల్!  

Advertisement

శిక్ష అమలు ప్రక్రియ మొదలైన తర్వాత పైక్‌కు ప్రాణాంతక ఔషధం రెండు డోసులు ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి సమయంలో కొన్ని నిమిషాల్లో మనిషి చనిపోతాడు. కానీ, ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. రెండు డోసులు ఇచ్చిన తర్వాత కూడా పైక్ శ్వాస తీసుకుంటూనే ఉంది. అంతేకాదు.. ఆమె గురక పెట్టినట్లు, మాట్లాడినట్లు, చేతికి నొప్పిగా ఉందని చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంటే అధికారులు ఊహించిన ‘ది ఎండ్’ బటన్ నొక్కినా.. కథ మాత్రం ఆగలేదు!

మరణశిక్ష ప్రక్రియ నిలిపివేత!

పైక్ ప్రాణాలతో ఉండటంతో అధికారులు మరణశిక్ష అమలు ప్రక్రియను నిలిపివేశారు. అనంతరం ఆమెను జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. తాజా సమాచారం ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉందని న్యాయవాదులు తెలిపారు. టెన్నెసీ డిపార్ట్‌ మెంట్ ఆఫ్ కరెక్షన్ మాత్రం తాము రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టబద్ధమైన ప్రోటోకాల్ ప్రకారమే ప్రతి దశను పూర్తి చేశామని ప్రకటించింది. అయితే, రెండు డోసుల తర్వాత కూడా శిక్ష ఎందుకు అమలు కాలేదన్న ప్రశ్న మాత్రం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

ఆ తర్వాత ఏంటి? ఇదే అసలు ప్రశ్న!

Advertisement

టెన్నెసీ మరణశిక్ష విధానంపై ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది. మొదటి డోస్ తర్వాత ఖైదీ చనిపోకపోతే రెండో డోస్ ఇవ్వాలనే విధానం ఉంది. కానీ, రెండో డోస్ ఇచ్చిన తర్వాత కూడా ఖైదీ ప్రాణాలతో ఉంటే తదుపరి ఏం చేయాలన్న దానిపై స్పష్టమైన నిబంధన లేదని నివేదికలు చెబుతున్నాయి. అంటే.. ‘రెండోసారి కూడా పనిచేయకపోతే?’ అనే ప్రశ్నకు అక్కడి రూల్‌బుక్ కూడా సమాధానం కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట!

గవర్నర్ కీలక నిర్ణయం!

ఈ ఘటనపై టెన్నెసీ గవర్నర్ బిల్ లీ స్వతంత్ర థర్డ్‌ పార్టీ సమీక్షకు ఆదేశించారు. 2026లో మిగిలిన మరణశిక్షల అమలును కూడా నిలిపివేశారు. ఈ ఘటన ఎలా జరిగిందో, ప్రోటోకాల్‌లో ఏదైనా లోపం ఉందా? అనే అంశాలను సమీక్షించనున్నారు. మరణశిక్ష అమలు అంటే అత్యంత కఠినమైన చట్టపరమైన ప్రక్రియ. కానీ, రెండు ప్రాణాంతక ఇంజెక్షన్ల తర్వాత కూడా ఓ ఖైదీ ప్రాణాలతో బయటపడటం మాత్రం అసాధారణ పరిణామంగా మారింది. త్వరలోనే పైక్ మరణ శిక్షపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

Read Also: మానవులు ఏలియన్స్ తో మాట్లాడవచ్చా? భవిష్యత్ లోనైనా సాధ్యమేనా?

Tags

Related News

మందు ముట్టరు.. కట్టుబాటు దాటరు.. 25 ఏళ్లుగా మద్యానికి దూరంగా 11 గ్రామాలు!

పెట్రోల్‌ రూల్స్‌ లో బిగ్‌ చేంజ్‌.. లైసెన్సు లేకుండా బిజినెస్ చేస్తే ఇక అంతే సంగతులు!

చారణా కోడికి బారణా మసాలా.. రూ. 70 వేల బైక్ మీద రూ. 10 లక్షల చలాన్లు!

ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. ఏ అవార్డు ఇవ్వనున్నారంటే?

చెప్పడం కాదు.. చేసి చూపించాడు.. పైలట్‌ బాధ్యత గురించి స్మిత్ మచ్చర్ పాత పాడ్‌కాస్ట్ వైరల్!

ఇప్పుడు స్మిత్.. అప్పుడు నీర్జా.. తూటాలకు ఎదురొడ్డి వందల మంది ప్రాణాలు కాపాడిన వీరవనిత!

రైలు టికెట్ బుక్ చేశారా? ప్రయాణం కుదరకపోతే సింపుల్ గా వేరొకరికి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు!

Big Stories

Advertisement
×