Bigg Boss 9 Promo:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కార్యక్రమం అలా మొదలైందో లేదో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా ముక్కుసూటి మనిషిగా పేరు సొంతం చేసుకొని జ్యూరీ మెంబర్స్ మెచ్చిన కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు మాస్క్ మ్యాన్ హరీష్ (Mask man Harish). ఇకపోతే అలా హౌస్ లోకి అడుగు పెట్టారో లేదో ఇప్పుడు ఆయన తన ప్రతాపం చూపిస్తున్నారు అని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. అందులో భాగంగానే మాస్క్ మ్యాన్ హరీష్ కంటెస్టెంట్స్ కి పనులు అప్పగిస్తూ కొంతమందిపై ఫైర్ కూడా అయ్యారు.
ప్రోమో విషయానికి వస్తే.. ప్రోమో స్టార్ట్ అవ్వగానే ఎప్పటిలాగే కంటెంట్ అందరూ గుడ్ మార్నింగ్ చెబుతూ ఆటపాటలతో డాన్స్ చేసి సందడి చేశారు. ఇమ్మానుయేల్ (Emmanuel) మాట్లాడుతూ..”మొదటిసారి బిగ్ బాస్..పడుకున్నప్పుడు నాకు చెమటలు పట్టాయి” అంటూ చెప్పి అందరినీ నవ్వించారు. ఆ తర్వాత కొంతమందికి ఎల్లో బ్యాడ్జ్, మరికొంతమందికి గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చారు. కానీ మర్యాద మనీష్ కి మాత్రం ఇంకా ఎటువంటి బ్యాడ్జ్ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. కామనర్స్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు ఒక్కొక్కరికి హౌస్ లో పనులు అప్పగించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే హరీష్ రంగంలోకి దిగి.. ఎవరు ఎలాంటి పనులు చేయాలి అని చెబుతూనే సడన్గా కొంతమంది సంజన గర్లానీ లాంటి వాళ్ళు తిని కూర్చుంటున్నారు. అలా కూర్చునే బదులు తలా ఒక చేయి వేస్తే పనులు త్వరగా అవుతాయి కదా అంటూ తెలిపాడు. మనీష్ మధ్యలో మాట్లాడే ప్రయత్నం చేయగా ఎటువంటి సమస్యలు వచ్చిన నేను ఫేస్ చేస్తాను.. అంటూ మనీష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతుంది.
రణరంగం అనిపిస్తున్న కంటెస్టెంట్స్..
మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్ ఈసారి చదరంగం కాదు రణరంగంలా ఉండబోతోంది అంటూ నాగార్జున ముందే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే ఇక అందుకు తగ్గట్టుగానే కంటెస్టెంట్స్ వ్యవహరిస్తున్నారు అని అర్థమవుతోంది. ప్రస్తుతం హౌస్ లో రెండు హౌస్ లు ఉన్న నేపథ్యంలో మెయిన్ హౌస్ లో ఆల్రెడీ కామనర్స్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు సెలబ్రిటీలు మెయిన్ హౌస్ లోకి స్థానం సంపాదించుకోవాలి అంటే భారీగా కష్టపడాల్సి ఉంటుంది. ఆడియన్స్ మన్ననలు పొందడమే కాకుండా టాస్కులు త్వరగా కంప్లీట్ చేసి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లలో నెగ్గాల్సి ఉంటుంది. మరి ఈసారి కామనర్స్ కి , సెలబ్రిటీలకి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతున్న నేపథ్యంలో ఎవరు టైటిల్ విజేతగా నిలుస్తారో చూడాలి.
ALSO READ:Bigg Boss 9 Telugu: ఫ్రెండ్ కోసం జన సైనికులను సిద్ధం చేస్తున్న నాగబాబు.. టైటిల్ గ్యారంటీనా?