E-Paper

అరబిక్ చిత్రసీమలోకి AR రెహమాన్ అడుగు.. ‘బాబ్’ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ రిలీజ్!

అరబిక్ చిత్రసీమలోకి AR రెహమాన్ అడుగు.. ‘బాబ్’ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ రిలీజ్!
Advertisement

AR Rahman:ఏఆర్ రెహమాన్…అప్పటిదాకా సాగిపోతున్న మూస సంగీతానికి తనదైన మార్క్ ట్యూన్స్ తో చెక్ పెట్టిన మ్యూజిక్ మెజీషియన్.అలాంటి సంగీత సంచలనం ఇపుడు తన మ్యూజికల్ జర్నీలో ఎవరూ ఊహించని సరికొత్త సంచలనానికి తెరలేపారు. రోజా, బాంబే చిత్రాల నుంచి మొదలై మొన్నటి పొన్నియిన్ సెల్వన్, ఆడుజీవితం (ది గోట్ లైఫ్) వరకు ఆయన ప్రతీ సినిమాకు అందించిన సంగీతం ఒక విజువల్ వండర్.

హాలీవుడ్ చిత్రం స్లమ్‌డాగ్ మిలియనీర్ ద్వారా ప్రపంచాన్ని ఆస్కార్ వేదికపై భారత్ వైపు తిరిగి చూసేలా చేసిన రెహమాన్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ హిస్టరీ క్రియేట్ చేశారు. ప్రముఖ దర్శకురాలు నైలా అల్ ఖాజా  ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాబ్’ (Baab) అనే సైకలాజికల్ ఫాంటసీ-థ్రిల్లర్ మూవీ కోసం రెహమాన్ ఫస్ట్ టైమ్ అరబిక్ ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఈరోజు విడుదలైన ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

పూర్తిస్థాయి ఆల్బమ్ చేయడం ఇదే తొలిసారి

Advertisement

సినిమా రంగంలో ఎన్నో ప్రయోగాలు చేసిన రెహమాన్‌కు అరబిక్ శబ్దాలు, అక్కడి సంస్కృతి కొత్తేమీ కాదు. గతంలో ఆయన ‘మహమ్మద్: ది మెసెంజర్ ఆఫ్ గాడ్’ వంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లకు అద్భుతమైన స్కోర్ ఇచ్చారు. కానీ ఒక పక్కా కమర్షియల్, కల్ట్ సైకలాజికల్ అరబిక్ ఫిల్మ్‌కు పూర్తిస్థాయి ఆల్బమ్ చేయడం మాత్రం ఇదే తొలిసారి. ఈ సరికొత్త ఆల్బమ్‌లో మొత్తం 10 అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. రెహమాన్‌కు చెందిన సొంత ఆడియో కంపెనీ KM మ్యూజిక్ లేబుల్‌పై రిలీజ్ అయిన ఈ సౌండ్‌ట్రాక్‌ను ప్రముఖ డిజిటల్ నెట్‌వర్క్ డివో సంస్థ గ్లోబల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ప్రస్తుతం స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్, వింక్, జియోసావన్ వంటి అన్ని మేజర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ పాటలు వినేవారిని ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్తున్నాయి.

Advertisement

also read :Kissik Talks Show :హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ కావాలా? స్నో అక్క’ మౌనిష కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ వైరల్!

మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

ఈ ప్రయోగం గురించి రెహమాన్ మాట్లాడుతూ, ఇదొక సాధారణ సినిమా కాదని, నైలా అల్ ఖాజా సృష్టించిన విజువల్ వరల్డ్ తనను ఎంతగానో కదిలించిందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథలోని డెప్త్ కోసం తాను ఇప్పటివరకు టచ్ చేయని సరికొత్త సౌండ్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించినట్లు, అరబిక్ చిత్రసీమలోకి తన ప్రయాణం ఎంతో అర్థవంతంగా సాగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో పెర్ఫ్యూమ్: ది స్టోరీ ఆఫ్ ఎ మర్డరర్ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ తరహాలోనే ఈ బాబ్ సినిమా కోసం కూడా రెహమాన్ మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లు ఇన్సైడ్ టాక్.

లీడ్ రోల్‌ పోషించిన యాక్ట్రెస్ షైమా ఎల్ ఫదుల్

ఇక ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, వాహిదా అనే ఒక యువతి చుట్టూ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తిరుగుతుంది. తన కవల సోదరి అనుమానాస్పదంగా మరణిస్తుంది. ఆ మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని తెలుసుకోవడానికి వాహిదా ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఆమెకు కొన్ని పాత మిస్టీరియస్ ఆడియో క్యాసెట్ టేపులు దొరుకుతాయి. ఆ టేపులు వింటున్న కొద్దీ ఆమె జీవితంలో ఎలాంటి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి, ఆ ఫాంటసీ ప్రపంచంలో ఆమె ఎలా చిక్కుకుపోయింది అనే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందింది. ఇందులో లీడ్ రోల్‌ను టాలెంటెడ్ యాక్ట్రెస్ షైమా ఎల్ ఫదుల్ ఎంతో ఇంటెన్సివ్‌గా పోషించారు.

also read :మైథలాజికల్ మిస్టరీతో వస్తున్న ‘నాగబంధం’.. ట్రైలర్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన విరాట్ కర్ణ!

ఒకవైపు ఇండియన్ సినిమాలో రాబోయే థగ్ లైఫ్, ఛావా వంటి బిగ్గెస్ట్ సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు ఇలాంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో రెహమాన్ తన మ్యూజిక్ రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. ఇటు క్లాసిక్ లవర్స్‌ను, అటు మోడరన్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్న బాబ్ ఆల్బమ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో మ్యూజిక్ చార్ట్స్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

మళ్లీ థియేటర్లలో ‘ఆల్ ఈజ్ వెల్’.. రెండు దశాబ్దాల తర్వాత ‘3 ఇడియట్స్’ మ్యాజిక్!

మైథలాజికల్ మిస్టరీతో వస్తున్న ‘నాగబంధం’.. ట్రైలర్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన విరాట్ కర్ణ!

పవన్ కళ్యాణ్ కాళ్లు కడిగినా మీకు ఆ అర్హత రాదు.. పేర్ని నానికి కిరాక్ ఆర్పీ లెఫ్ట్ అండ్ రైట్!

డబ్బుంది కదా అని బిల్డప్ లేదు.. నడిరోడ్డుపై నిద్రపోయిన బాలీవుడ్ సెలబ్రిటీ..

షారుక్ మాటతో 42 లక్షల బిల్లు మాఫీ..కట్ చేస్తే ఇప్పుడు 80 కోట్ల సినిమా

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. స్టార్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు!

రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?.. అస్సలు ఊహించలేరు..

Big Stories

×