Ramayana Movie:భారతీయ సినిమాలలో ఇప్పటికే రామాయణ కథ ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. త్వరలోనే రామాయణం ఆధారంగా మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది . బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)సాయి పల్లవి(Sai Pallavi) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రామాయణ(Ramayana). ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో(Sita Role) సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్ యష్(Yash) సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు కావడంతో మంచి ఆదరణ లభిస్తుంది.
ఇక ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటించబోతున్నారనే విషయం తెలియగానే పెద్ద ఎత్తున ఈమెపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా సాయి పల్లవి లుక్స్ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే సాయి పల్లవి కంటే ముందుగా ఈ సినిమాలో మరొక హీరోయిన్ ఎంపిక అయ్యారని అయితే ఈ సినిమాలో యశ్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి రామాయణ సినిమాని రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే..
రామాయణ సినిమాలో సీత పాత్ర కోసం సాయి పల్లవి కంటే కూడా శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)ఆడిషన్స్ పాల్గొన్నారని తెలుస్తోంది.ఈమె ఈ సినిమాకు ఆడిషన్ కూడా ఇచ్చారట కానీ ఈ సినిమాలో యశ్ రావణాసురుడిగా కనిపిస్తున్న నేపథ్యంలో సీత పాత్రను రిజెక్ట్ చేశారంటూ వార్తలు వచ్చాయి.. కే జి ఎఫ్ సినిమాలో యశ్ కు ప్రియురాలుగా నటించిన ఈమె ఇప్పుడు యష్ కు వ్యతిరేకంగా నటించలేను అంటూ ఈ సినిమా రిజెక్ట్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు బయటకు వచ్చాయి.
ఈ విధంగా రామాయణ సినిమా శ్రీనిధి శెట్టి రిజెక్ట్ చేశారంటూ వస్తున్న వార్తల పట్ల ఈమె స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. తాను రామాయణ సినిమాలో సీత పాత్రకు ఎంపిక అయ్యానని అయితే తానే రిజెక్ట్ చేసాను అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. తాను ఆడిషన్ కి వెళ్ళిన మాట వాస్తవమే అయితే ఆడిషన్స్ లో తనని సెలెక్ట్ చేయలేదని, అందుకే తాను ఈ భారీ ప్రాజెక్ట్ లో భాగం కాలేకపోయానని శ్రీనిధి శెట్టి క్లారిటీ ఇచ్చారు. ఇలా శ్రీనిధి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది. ఇక ఈ సినిమాలో సూర్పనఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా విభిన్నమైన కథ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన యశ్ మొదటిసారి ఈ సినిమాలో రావణాసురుడిగా విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.
Also Read: విశ్వక్ సేన్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్… విజయ్ దేవరకొండ వాయిస్ తో…