ENE Repeate Trailer: పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడుగా మారి పలు సినిమాలకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్(Tarun Bhascker) డైరెక్షన్లో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం ఈ నగరానికి ఏమైంది. ఈ సినిమాకు మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ‘ఈఎన్‌ఈ రిపీట్’ (ENE Repeate) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా నవంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో వైరల్ అవుతుంది.
నగరానికి ఏమైంది సినిమాలో చివర్లో విశ్వక్ సేన్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో షార్ట్ ఫిలిం తీస్తున్నట్టు చూపించారు. ఈ ట్రైలర్ అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. విజయ్ దేవరకొండ వాయిస్ తో ఈ ట్రైలర్ కొనసాగుతుంది. విశ్వక్ సేన్ సినిమాకు డైరెక్టర్గా కొనసాగుతూ ఉంటారు అయితే ఈయన సినిమా చేయడం కోసం తన నలుగురు స్నేహితులతో కలిసి ఈయన బ్యాంకాక్ వెళ్ళగా అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనే విషయాలను చాలా ఫన్ , ఎంటర్టైనింగ్ గా చూపించారు. మొదటి భాగంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అదే ఫ్రెండ్స్ గ్యాంగ్, ఈసారి మరింత సరికొత్త ఫన్, కామెడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఈ ట్రైలర్ వీడియో చూస్తేనే తెలుస్తుంది .
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్గా సందడి చేశారు. మరి ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఈఎన్‌ఈ రిపీట్’ ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా మొదటి భాగం ఈ నగరానికి ఏమైంది మొత్తం గోవా బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాగా, ‘ఈఎన్‌ఈ రిపీట్’ మాత్రం బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చాలా సంవత్సరాలు తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనే ఆత్రుత నెలకొంది. ఇటీవల కాలంలో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా సినిమాలు చేయడం కంటే కూడా సినిమాలలో నటుడిగా, హీరోగా చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక విశ్వక్ విషయానికి వస్తే వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈయన ఇటీవల ప్రేక్షకుల నుంచి నిరాశ ఎదుర్కొంటున్నారు. తాజాగా కల్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న విశ్వక్ త్వరలోనే ‘ఈఎన్‌ఈ రిపీట్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Also Read: మరో కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. ఐడియా అదుర్స్!