Kissik Talks Show: సోషల్ మీడియా సెలబ్రిటీలు స్క్రీన్ మీద ఎంత నవ్వుతూ కనిపిస్తారో, వారి వెనుక అంతకు మించిన ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుందని మరోసారి నిరూపించింది తాజా టాక్ షో. ఇన్‌స్టాగ్రామ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో, రీల్స్‌తో ‘స్నో అక్క’గా క్రేజ్ తెచ్చుకున్న మౌనిష (Mounisha), తాజాగా ప్రముఖ ‘కిసిక్ టాక్స్’ (Kissik Talks) ఇంటర్వ్యూలో పాల్గొంది. BIG టీవీలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సరదా ముచ్చట్లతో మొదలైన ఈ ఇంటర్వ్యూలో.. కాస్టింగ్ కౌచ్, సోషల్ మీడియా ట్రోల్స్, మరియు తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒక విషాదాన్ని పంచుకుంటూ మౌనిష కన్నీరు పెట్టుకుంది.
టెక్సస్, డల్లాస్, వంటి ప్రాంతాల్లో ఉండే ఎన్నారై (NRI) యూత్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ.. “అక్కడ తట్టలు తట్టలు స్నో పడుతుంటే మనం ఇక్కడ తట్టలు తట్టలు ఎత్తేస్తున్నాం” అంటూ పంచ్‌లతో నవ్వులు పూయించారు. పెళ్లయి, ఒక పాప ఉన్న మౌనిష, చిన్నప్పటి నుండి తనకు మాట్లాడటం అంటే ఎంత ఇష్టమో చెప్తూ.. “మా అమ్మమ్మ వాళ్ళు రూ.10, రూ .20 ఇచ్చి కాసేపు గమ్మున కూర్చోమన్నా నేను వినేదాన్ని కాదు, నాకు డబ్బులు వద్దు నేను మాట్లాడుతానే ఉంటా” అంటూ తన లైఫ్ స్టైల్‌ను గుర్తుచేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాపులర్ అయిన మౌనిషకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎలాంటి ఆఫర్స్ వచ్చాయనే ప్రశ్న ఎదురైనప్పుడు, ఆమె షాకింగ్ నిజాలను బయటపెట్టింది. కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చిన మాట నిజమే కానీ, ఆడిషన్స్ పేరుతో ఎదురైన ప్రశ్నలు దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది.”సినిమా ఆఫర్ అని అడిగి.. మీ బాడీ మెజర్మెంట్స్ ఎంత? నీ థై సైజ్ (Thigh Size) ఎంత? అని అడుగుతారు. హీరోయిన్ అవ్వాలంటే యాక్టింగ్ వచ్చా రాదా అని అడగాలి కానీ ఇవన్నీ ఎందుకు? రాదు అని చెప్తే దొబ్బేయ్ అనాలి, అంతే కానీ ఈ కొలతలు ఏంటి?” అంటూ మౌనిష ఫైర్ అయింది.
also read :వీడియో కాన్ఫరెన్స్ కుదరదు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు బిగ్ షాక్!
అంతేకాకుండా, ఇండియా టూరిజం యాడ్ ఆడిషన్ కోసం తనను పిలిచి, ‘మినీ స్కర్ట్, క్రాప్ టాప్’ వేసుకుని రమ్మన్నారని, ఇండియా టూరిజానికి మినీ స్కర్ట్‌లకి ఉన్న సంబంధం ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదని ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని కడిగేసింది.
సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీపై స్పందిస్తూ, తన మదర్‌హుడ్ (మాతృత్వం) పై వచ్చిన ఒక కామెంట్ తనను తీవ్రంగా డిస్టర్బ్ చేసిందని చెప్పింది. “మీరు చూసే ఒక 30 సెకన్ల రీల్‌ను బట్టి నేను నా పిల్లని సరిగ్గా పెంచుతున్నానా లేదా అని మీరెలా డిసైడ్ చేస్తారు? నా మదర్‌హుడ్ మీదకొస్తే నాకు సుర్రుమంటుంది” అంటూ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.ఇక హస్బెండ్ మొబైల్ చెక్ చేసే అలవాటు ఉందా అన్న క్రేజీ ప్రశ్నకు సమాధానమిస్తూ.. “మా హస్బెండ్ అనే కాదు, మా డాడీ ఫోన్, చివరికి మీ ఫోన్ ఇక్కడ వదిలేసి పోయినా నేను గెలికేస్తా. అది నమ్మకం లేక కాదు.. నా దూల వల్లే!” అంటూ నవ్వించేసింది. అలాగే ఇప్పటి జెన్జీ (Gen Z) లవ్స్, సిట్యువేషన్ షిప్స్, బెంచింగ్స్ తనకు అస్సలు అర్థం కావని తేల్చేసింది.
also read :మైథలాజికల్ మిస్టరీతో వస్తున్న ‘నాగబంధం’.. ట్రైలర్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన విరాట్ కర్ణ!
ఇంటర్వ్యూ చివర్లో మౌనిష తన జీవితాన్ని మార్చేసిన ఒక అత్యంత బాధాకరమైన సంఘటనను పంచుకుంటూ ఎమోషనల్ అయింది. 2021లో ఆమె ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో.. మరో రెండు నెలల్లో కొడుకు పుడతాడనగా సడన్‌గా కడుపులోనే బాబు హార్ట్ బీట్ ఆగిపోయిందని (Stillbirth) చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది.”ఇంత కష్టం ఎందుకు పెట్టాడు? దేవుడు అనేవాడు ఉంటే ఇంత కష్టపెట్టడు, అందుకే దేవుడు లేడని నమ్మేసాను. ఒకానొక టైంలో జీవితం మీద హోప్స్ పూర్తిగా వదిలేసుకున్నాను” అంటూ మనసులోని బాధని బయటపెట్టేసింది.
నవ్వులు, షాకింగ్ నిజాలు, గుండె బరువెక్కించే ఎమోషన్స్‌తో సాగిన ఈ పూర్తి ఎపిసోడ్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు BIG టీవీలో ప్రసారం కానుంది. మిస్ కాకుండా చూసేయండి!