E-Paper
Advertisement

సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనేనా? పెళ్లి తేదీ ఫిక్స్!

సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనేనా? పెళ్లి తేదీ ఫిక్స్!
Advertisement

Sai Dharam Tej Wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగబోతున్నాయి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే
సాయిధరమ్ తేజ్ పెళ్లి(Sai Dharam Tej Wedding) గురించి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈయన పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం వైరల్ అవుతుంది. ఇకపోతే ఇటీవల సాయి తేజ్ పెళ్లి హైదరాబాద్లోనే డిసెంబర్లో జరగబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి.

పెళ్లి కుమార్తె పేరు కిరణ్మయి..

తాజాగా సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించి మరికొన్ని వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి ధరంతేజ్ తన స్నేహితురాలు కిరణ్మయి(Kiranmayi) అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వీరి పెళ్లిని పెద్దలు అంగీకరించడంతో పెద్దల సమక్షంలో ఈ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది తెలుస్తోంది. అయితే వీరిద్దరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ గతంలో వార్తలు వచ్చాయి కానీ వీరి వివాహం మాత్రం హైదరాబాద్లోనే ఎంతో ఘనంగా జరగబోతున్నట్టు సమాచారం.

డిసెంబర్ 10న సాయి తేజ్ వివాహం..

Advertisement

ఇకపోతే ఇప్పటికే పెళ్లికి సంబంధించిన మాటలు పూర్తి అయ్యాయని, నవంబర్ 5వ తేదీ వీరి నిశ్చితార్థపు వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు కిరణ్మయి అని తెలిసినప్పటికీ తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? అమ్మాయి ఎలా ఉంటుంది అనే వివరాలు మాత్రం ఎక్కడా తెలియలేదు. ఇక వీరి వివాహం డిసెంబర్ లోనే జరగబోతుందని డిసెంబర్ 10వ తేదీ వివాహపు తేదీ కూడా ఖాయమైందని సమాచారం. ఈ వివాహపు తేదీని నిశ్చితార్థ సమయంలో అధికారకంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

మౌనం వహిస్తున్న మెగా ఫ్యామిలీ..

ఈ విధంగా మెగా హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన పెళ్లికి సంబంధించి నిత్యం ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నప్పటికీ ఈ వార్తల పట్ల మెగా ఫ్యామిలీ మాత్రం ఇప్పటికీ మౌనంగా ఉన్నారు. ఇప్పటికైనా ఈ వార్తలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక సాయి తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన సంబరాల ఏటిగట్టు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపారు.

Advertisement

Also Read: ఘనంగా బుల్లితెర నటి మేఘన లోకేష్ సీమంతపు వేడుక..

Related News

జిమ్ జిమ్ తార పాటకు లక్ష్మీ ఆంటీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

త్రివిక్రమ్ కి నాగవంశీకి చెడిందా?

9 నెలల్లో రూ.132 కోట్ల ఆస్తి నష్టం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!

రాధిక ఆప్టేపై బాలయ్య ఫాన్స్ ఫైర్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ నిర్మాతానా.. కోలీవుడ్ ప్రమోటరా? తమిళ సినిమాలపై ఆ నిర్మాతకు అంత మోజు ఏంటో!

ఆ సినిమా చూసి రంపం వాడిన రాప్తాడు నిందుతుడు.. ఇదేం దరిద్రం రా బాబు!

మెగా ఫ్యామిలీలో పెళ్లి సంబరాలు షురూ… సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేదిక ఫిక్స్?

Big Stories

Advertisement
×