BigTV English

AR Rahman: రామాయణ కోసం పురాతన రుద్రవీణ… గట్టిగానే ప్లాన్ చేస్తున్న రెహమాన్!

AR Rahman: రామాయణ కోసం పురాతన రుద్రవీణ… గట్టిగానే ప్లాన్ చేస్తున్న రెహమాన్!

AR Rahman: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్(AR Rahman) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెహమాన్ ఓ సినిమా కోసం కమిట్ అయ్యారనే విషయం తెలియగానే ఆ సినిమాపై ఎన్నో మంచి అంచనాలు ఉంటాయి. ఇకపోతే బాలీవుడ్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “రామాయణ” (Ramayana). ఈ సినిమా దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor)నటించగా, సీత పాత్రలో నటి సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తున్నారు.


హన్స్ జిమ్మర్, రెహమాన్..

ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు నితీష్ కుమార్ (Nitesh Tiwari)దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ తో పాటు హన్స్ జిమ్మర్ (Hans Zimmer)కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇలా ఈ సినిమా కోసం ఇద్దరూ సంగీత దిగ్గజాలు పనిచేస్తున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి.


రామాయణ కోసం రుద్రవీణ…

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామాయణం ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో రెహమాన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బ్యాగ్రౌండ్ సోర్స్ కోసం భారతీయ వాయిద్యాలలో అతి పురాతనమైన రుద్రవీణను (Rudra Veena) రెహమాన్ ఉపయోగించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ పనులు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది.. ఈ సినిమా కోసం రుద్రవీణ ఉపయోగించబోతున్నారని విషయం తెలియడంతో ఏఆర్ రెహమాన్ చాలా గట్టిగానే ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది.

ఆకట్టుకున్న గ్లింప్ వీడియో..

ఇక ఈ సినిమా ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇటీవల ఈ సినిమా నుంచి అందరి పాత్రలను పరిచయం చేస్తూ ఒక గ్లింప్ వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియో సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం 2026 దీపావళి పండుగను పురస్కరించుకొని విడుదల కాగా రెండవ భాగం 2027 దీపావళి పండుగ పురస్కరించుకొని ప్రేక్షకుల ముందు రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఈ సినిమాలో రావణాసురుడిగా యష్ నటించగా, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్త, లక్ష్మణుడి పాత్రలో రవి దూబే వంటి వారు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

 

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×