Kangana Ranaut: బాలీవుడ్ బ్యూటీగా, కాంట్రవర్సీ క్వీన్ గా పేరు సొంతం చేసుకుంది కంగనా రనౌత్ (Kangana Ranaut) . ముఖ్యంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. అంతేకాదు వాటి వల్ల అప్పుడప్పుడు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు హైకోర్టులో భారీ దెబ్బ తగిలింది అని తెలుస్తోంది.
కిసాన్ ఉద్యమంలో మహిళను అగౌరవపరిచిన కంగనా..
అసలు విషయంలోకి వెళ్తే.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి మండి బిజెపి ఎంపీగా కొనసాగుతున్న ఈమెకి పంజాబ్ – హర్యానా హైకోర్టులో ఒక కేసులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై ఉన్న డెఫమేషన్ కేసును రద్దు చేయాలి అంటూ ఈమె వేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఇకపోతే ఈ కేసు ఇప్పటిది కాదు.. 2021 లో జరిగిన సంఘటనకు సంబంధించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కిసాన్ ఆందోళన జరుగుతున్న సమయంలో.. కంగనా ఒక ట్వీట్ చేసింది. అందులో బతిండా జిల్లా బహదూర్ఘడ్ జండియా గ్రామానికి చెందిన మహేందర్ కౌర్ అనే 87 సంవత్సరాల వృద్ధ మహిళను 200 రూపాయలు తీసుకొని ఆందోళనకు వచ్చిన మహిళగా ఈమె అభివర్ణించారు.
కంగనా పై కేస్ ఫైల్..
ఇక దీంతో సోషల్ మీడియాలో నిరసనలు మొదలయ్యాయి. ఈ ట్వీట్ సదరు మహిళ గౌరవాన్ని దెబ్బతీసిందని.. ఈమెపై 2021 జనవరి 4వ తేదీన బాధ్యత మహిళ మహీందర్ కౌర్.. బతిండా కోర్టు లో కంగనాకు వ్యతిరేకంగా డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. అయితే ఆ తర్వాత ఈమె ఆ ట్వీట్ తొలగించినా.. అప్పటికే ఈమెపై కేసు నమోదు అయింది.
కేసు కొట్టి వేయాలంటూ హైకోర్ట్ లో పిటిషన్..
ఇక ఈ కేసు పై దాదాపు 13 నెలల పాటు విచారణ జరిగిన తర్వాత ఈమెకు నోటీసులు జారీ చేసింది కోర్టు.. ఇక ఈ కేసును కొట్టి వేయించుకోవాలని హర్యానా – పంజాబ్ హైకోర్టులో కంగనా పిటిషన్ దాఖలు చేసింది.
కంగనా పిటిషన్ కొట్టి వేసిన హైకోర్టు..
ఇకపోతే జస్టిస్ త్రిభువన్ సింగ్ దహియా నేతృత్వంలో కోర్టు ఈమె పిటిషన్ ను తిరస్కరించింది. ఈమె ఒక సెలబ్రిటీ అని, ఈమె చేసిన ట్వీట్ వల్ల బాధిత మహిళ ప్రతిష్టకు హాని కలిగిందని, ఈమె చేసిన కామెంట్ల వల్ల సదరు మహిళ అభిమానానికి దారి తీసేలా ఉందని కోర్టు తెలిపింది. ఇక అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాతనే ఈమెపై ప్రాథమికంగా ఐపీఎస్ సెక్షన్ 499 ప్రకారం కేసు కొనసాగించాలని నిర్ణయించింది ధర్మాసనం. అంతేకాదు పంజాబ్లోని స్థానిక కోర్టులో కంగనా విచారణకు హాజరు కావాలి అని కూడా స్పష్టం చేసింది.
పిటిషన్ విచారణలో వాదనలు వినిపించిన కంగనా.
ఇకపోతే ధర్మాసనం విచారణ జరుపుతున్న సమయంలో తన వాదనలను వినిపించింది కంగనా. తాను ఆ ట్వీట్ రాయలేదు అని, ఒక న్యాయవాది వేసిన పోస్టును కేవలం రీ ట్వీట్ చేశానని మాత్రమే తెలిపింది. అయినా సరే ఈ వాదనను కోర్టు తోసిపుచ్చడం గమనార్హం.
Also read: Anushka Shetty: ఎట్టకేలకు పెళ్లిపై ఓపెన్ అయిన స్వీటీ.. అలాంటి వ్యక్తి భర్తగా రావాలంటూ!