Sunil Reddy:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరు మోసిన దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న ఏ.కోదండరామిరెడ్డి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi) తో ఆయనకున్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. చిరంజీవి హీరోగా, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో న్యాయం కావాలి, గూండా, ఖైదీ,ఛాలెంజ్, దొంగ రాక్షసుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, అభిలాష వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు కొండవీటి దొంగ, ముఠామేస్త్రి వంటి చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. అలా తెలుగు ఇండస్ట్రీలో పేరున్న డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న ఏ కోదండరామిరెడ్డి వారసులు కూడా టాలీవుడ్ లోనే టాప్ పొజిషన్లో ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన వారసులలో ఒకరు మాత్రం టాలీవుడ్ వదిలి కోలివుడ్లో స్టార్ నటుడుగా దూసుకుపోతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.. మరి ఆయన ఎవరు? ఆయన నటించిన చిత్రాలు ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
కోదండరామిరెడ్డి తనయుడు మరెవరో కాదు సునీల్ రెడ్డి (Sunil Reddy). సాధారణంగా సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది కొత్త విషయం కాదు. చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకుల వారసులు సినిమాలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి తండ్రి ఎంత పెద్ద దర్శకుడైనా సరే వారిలో కొందరు ఆ ఇమేజ్ పై ఆధారపడకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటివారిలో సునీల్ రెడ్డి కూడా ఒకరు. తండ్రి పేరును ఏమాత్రం ఉపయోగించుకోకుండా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ఈయన 2018లో విజయ్ సేతుపతి హీరోగా నటించిన సీతాకాతి అనే చిత్రం ద్వారా తన నటన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.
also read:బిగ్ బాస్ హౌస్ లో సడన్ ఎలిమినేషన్.. కానీ ఈ ట్విస్ట్ ఏంటి గురూ!
ఆ తర్వాత మాస్టర్, బీస్ట్, డాక్టర్, జైలర్, మామన్నన్ వంటి తమిళ చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో కనిపించారు. ముఖ్యంగా డాక్టర్ చిత్రంలో మహాలి పాత్రతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈయన సోదరుడు కూడా నటుడే కావడం గమనార్హం. ఆయన ఎవరో కాదు వైభవ్ రెడ్డి. తెలుగు చిత్రాలలో హీరోగా నటించిన ఈయన.. తమిళ్ చిత్రాలలో కూడా నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇటీవల సూర్య హీరోగా నటించిన ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ చిత్రంలో సునీల్ రెడ్డి కనిపించడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈయనపై ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందించిన డైరెక్టర్ కుమారుడు ఇప్పుడు తమిళ చిత్ర సీమలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరచుకోవడం నిజంగా గమనించదగ్గ విషయం అనే చెప్పాలి. ఏది ఏమైనా తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చి, ఆ పలుకుబడిని మరో చిత్రానికి ఉపయోగించుకోకుండా తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ పక్క రాష్ట్రంలో స్టార్ నటుడిగా పేరు సొంతం చేసుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం అని చెప్పాలి. టాలీవుడ్ చిత్రాలలో మంచి పాత్రలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.