BigTV English

Hair Fall Problem: జుట్టు రాలుతుందా? ఈ విటమిన్ లోపాలే కారణం, జస్ట్ ఇలా చేస్తే నిగనిగలాడే కురులు మీ సొంతం!

Hair Fall Problem: జుట్టు రాలుతుందా? ఈ విటమిన్ లోపాలే కారణం, జస్ట్ ఇలా చేస్తే నిగనిగలాడే కురులు మీ సొంతం!

Hair Growth:

జుట్టు రాలడం అనేది ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుషులను వేధిస్తున్న ప్రధాన సమస్య. మూడు పదుల వయసులోనే మగాళ్ల తలలు క్రికెట్ గ్రౌండ్లను తలపిస్తున్నాయి. ఆడాళ్లలోనూ బలమైన కురులు అనారోగ్యంగా మారి ఊడిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం టెన్షన్ లైఫ్, హార్మోన్ల అసమతుల్యతతో పాటు సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం. జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి, పెరుగుదలను ప్రోత్సహించడానికి, సన్నబడకుండా కాపాడాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజాలు. ఈ పోషకాలు లేకపోవడం వల్లే తల చర్మం బలహీనపడుతుంది. ఫలితంగా కుదుళ్లు అనారోగ్యంగా మారి, జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడానికి నేరుగా సంబంధం ఉన్న విటమిన్ లోపాలు ఏవి? వాటిని ఫుడ్, లైఫ్ స్టైల్ ద్వారా ఎలా కాపాడుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


జుట్టు రాలిపోవడానికి కారణమయ్యే విటమిన్లు

⦿ విటమిన్ D లోపం: కొత్త జుట్టు కుదుళ్లను సృష్టించడంలో విటమిన్ D కీలక పాత్ర పోషిస్తుంది. D విటమిన్ లోపం  జుట్టు మీద తీవ్రంగా పడుతుంది. ఈ లోపం నుంచి బయటపడాలంటే, ఉదయాన్ని లేలేత భానుడికిరణాలను ఒంటిమీద పడేలా చూసుకోవాలి. పాల ఉత్పత్తులు, చేపలు, పుట్టగొడుగులు తరచుగా తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.

⦿ విటమిన్ B12 లోపం: విటమిన్ B12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది ఆక్సిజన్, పోషకాలు తలపైకి చేరేలా చేస్తుంది. ఈ లోపం జుట్టు సన్నబడటానికి కారణం అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే పాల ఉత్పత్తులు, గుడ్లు, బలవర్థకమైన తృణధాన్యాలు తీసుకోవాలి.


⦿ విటమిన్ B7 లోపం: జుట్టు పెరుగుదలకు బయోటిన్(విటమిన్ B7) సాయపడుతుంది. బయోటిన్ లేకపోవడం వల్ల జుట్టు పెళుసుగా మారడం, విరిగిపోవడంతో పాటు చుండ్రు సమస్యలు తలెత్తుతాయి. గింజలు, చిలగడదుంపలు, పాలకూర, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల సమస్యను పరిష్కరించుకోవచ్చు.

⦿ విటమిన్ A లోపం:  విటమిన్ A అనేది తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే నేచురల్ ఆయిల్ సెబమ్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీని లోపం వల్ల తలపై చర్మం పొడిబారడంతో పాటు జుట్టు రాలుతుంది. క్యారెట్లు, గుమ్మడికాయ, చిలగడదుంప, పాలకూర తీసుకోవడం వల్ల A విటమిన్ లోపం నుంచి బయటపడవచ్చు.

⦿ విటమిన్ C లోపం: కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ C అవసరం. ఇది జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతుంది. జుట్టు ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకమైన ఐరన్ ను గ్రహించడంలో ఇది సాయపడుతుంది. పులుపు ఆహార పదార్థాలు అయిన సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి.

⦿ విటమిన్ E లోపం: విటమిన్ E అనేది తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్లను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. దీనిలోపం వల్ల కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలుతుంది. అలా జరగకుండా ఉండాలంటే బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవకాడో, పాలకూర తీసుకోవాలి.

⦿ ఐరన్ లోపం: ఐరన్ అనేది విటమిన్ కాకపోయినా జుట్టు మూలాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఐరన్ లోపం ఒకటి. ఐరన్ లోపం నుంచి బయటపడాలంటే కాయధాన్యాలు, పాలకూర, గుమ్మడికాయ గింజలు, క్వినోవా, బలవర్థకమైన తృణధాన్యాలు తీసుకోవాలి.

⦿ జింక్ లోపం:  జింక్ జుట్టు కణజాల పెరుగుదల, మరమ్మతులకు సపోర్టు చేస్తుంది. జింక్ సరిపడలేకపోవడం వల్ల తల  పొడిగా మారి, జుట్టు కుదుళ్లు బలహీనపడుతాయి. మాంసం, పప్పుధాన్యాలు, గింజలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

Read Also: ఆ దేశ ప్రజలు ఒంటె మూత్రం తాగుతారట.. కారణం తెలిస్తే మీరూ కావాలంటరేమో!

Related News

Pumpkin Seeds: గుమ్మడి గింజలు తింటున్నారా..? వచ్చే మార్పులు ఇవే!

Mobile Phones: పిల్లల ఆరోగ్యంపై.. మొబైల్ ఫోన్ ప్రభావం ఎంతలా ఉంటుందంటే ?

Health Benefits: బిర్యాని ఆకుతో బోలెడు ప్రయోజనాలు.. ఒక్కసారి వాడితే మంచి ఫలితాలు

Skin Glow: నేచురల్‌గానే.. ముఖం మెరిసిపోవాలంటే ?

Curd vs Buttermilk:పెరుగు Vs మజ్జిగ.. రెండిట్లో ఏది బెటర్ ?

Big Stories

×