E-Paper
Advertisement

జననాయగన్.. లాస్ట్ క్లిప్..థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆడియన్స్!

జననాయగన్.. లాస్ట్ క్లిప్..థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆడియన్స్!
Advertisement

Jana nayagan: సాధారణంగా థియేటర్లలో ఆడియన్స్ ఏడుస్తున్న దృశ్యాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.. అది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని కథా, కథనం ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మాత్రం ఎమోషనల్ గా వారు కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు వచ్చిన ఒక సినిమా కారణంగా.. అభిమానులు కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఆ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయా అంటే అది వేరే సంగతి. పైగా ఆ హీరోకి అదే చివరి సినిమా కావడం.. అయితే నాటి రోజులను గుర్తు చేస్తూ సినిమా ఎండింగ్లో వేసిన ఆ చిన్న క్లిప్ అభిమానులను కన్నీటి పర్యంతం అయ్యేలా చేసింది. మరి సినిమా మొత్తం చూశాక క్లైమాక్స్లో వేసిన ఆ చిన్న క్లిప్ కారణంగా ఎందుకు ఆడియన్స్ ఏడుస్తున్నారు? అసలు అందులో ఏముంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

జన నాయగన్ థియేటర్లో ఆడియన్స్ కన్నీళ్లు..

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమాగా ఎట్టకేలకు నేడు విడుదల అయింది జననాయగన్. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ ఇబ్బందులు, కోర్టు సమస్యల కారణంగా దాదాపు 7 నెలల పాటు వాయిదా పడిన ఈ సినిమా.. ఎట్టకేలకు నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. సినిమా ఎండ్ కార్డ్స్ లో వేసిన ఒక చిన్న క్లిప్ మాత్రం అభిమానులను కంటతడి పెట్టించింది.

అదిరిపోయే క్లిప్ తో సర్ప్రైజ్ చేసిన టీమ్..

Advertisement

ఇక ఆ చిన్న క్లిప్ లో ఏముంది అనే విషయానికి వస్తే.. థియేటర్లలో జననాయగన్ సినిమా ఎండ్ కార్డ్స్ పడుతున్న సమయంలో.. విజయ్ దళపతి తన కెరియర్ లో పోషించిన విభిన్నమైన పాత్రలన్నింటినీ కలిపి ఒక చిన్న వీడియో రూపంలో చేసి రిలీజ్ చేశారు. పైగా విజయ్ దళపతి చివరి సినిమా కావడం.. ఆయన కెరియర్లో ఆయన పోషించిన పాత్రలన్నింటికీ సంబంధించిన వీడియో ప్లే చేయడంతో అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక మళ్ళీ విజయ్ ను మనం తెరపై చూడలేమా? అంటూ ఎమోషనల్ అవుతున్నారు. అంతేకాదండోయ్ ఆ రోజులను చాలా మిస్ అవుతున్నాం కదా అంటూ ఎమోషనల్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

also read: ఇళ్ల గోడలకు పైన తెలుపు.. కింద ఎరుపు రంగు ఎందుకు? దాని వెనుక అసలు రహస్యం ఇదే

ప్రజల కోసం సినీ జీవితానికి స్వస్తి..

Advertisement

ఇకపోతే విజయ్ దళపతి ప్రస్తుతం తమిళనాడుకి ముఖ్యమంత్రిగా అవతరించిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత విడుదలైన తొలి చిత్రం.. అంతేకాదు ఈ చిత్రంతో ఆయన సినీ జీవితానికి స్వస్తిపలికారు. ఈ నేపథ్యంలోనే ఆయనను గుర్తు చేసుకుంటూ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఒక గొప్ప నటుడు ఇప్పుడు వెండితెరను వీడి ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేయడానికి అధికారంలోకి వచ్చేసారు అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా, మమిత బైజు కీలక పాత్రలు పోషించగా.. హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు.

?igsh=a3hybHJ6Y2RhdWcz

 

Related News

30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ‘ఆపద్బాంధవుడు’ హీరోయిన్!

ఒకే హీరోకి కూతురిగా, లవర్‌గా, తల్లిగా నటించిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా?

జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ఆసక్తికర విషయాలు బయటకు!

నన్ను ఒంటరిగా హోటల్ రూమ్‌కు రమ్మన్నారు.. సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్

సుప్రీంకోర్టులో బండ్ల గణేష్ కు ఎదురుదెబ్బ.. పిటిషన్ ను కొట్టి వేస్తూ కీలక తీర్పు!

దళపతి విజయ్ ‘జననాయగన్’ రివ్యూ: ఫ్యాన్స్ ఊహించింది ఒకటి.. జరిగింది వేరొకటి!

జూబ్లీహిల్స్ లో స్థల కబ్జా యత్నం.. బడా ప్రొడ్యూసర్స్ సి.కళ్యాణ్, బి. శివరామకృష్ణపై కేస్ ఫైల్!

Big Stories

Advertisement
×