E-Paper
Advertisement

‘సర్’ ప్రక్రియలో గందరగోళం.. అధికారుల లెక్కలు వేరు.. గ్రౌండ్ రియాలిటీ వేరు!

‘సర్’ ప్రక్రియలో గందరగోళం.. అధికారుల లెక్కలు వేరు.. గ్రౌండ్ రియాలిటీ వేరు!
Advertisement

Voter Enumeration: ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ వంద శాతం పూర్తయిందని అధికారులు చెబుతుంటే, మాకు ఫామ్స్ అందలేదని ఓటర్లు చెబుతున్నారు. సర్ ప్రక్రియ సజావుగా కంప్లీట్ కావాలంటే పూర్తి స్థాయి ఎఫర్ట్ కావాల్సిందే. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, మొత్తం సర్ ప్రక్రియపైనే ఆ ఎఫెక్ట్ పడుతోంది. విజిలెన్స్ టీంలతో నిఘా పెట్టామని ఈసీ చెబుతున్నా రిజల్ట్స్ మాత్రం అంతంతమాత్రమే.

ఫామ్స్ పంపిణీ నూరు శాతం పూర్తయిందని పలు జిల్లాల్లో రిపోర్ట్స్ సిద్ధం చేసినా, చాలామందికి ఇంకా ఫామ్స్ అందలేదు. కొందరు ఓటర్లు BLOలను వెతుక్కుని వెళ్లి మరీ ఫామ్స్ తీసుకుంటున్నారు. ఆఫీసులకు వెళ్లేవారు.. BLOలకు ఫోన్ చేసి ఉదయమో.. సాయంత్రమో ఆ ఫామ్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. రూరల్ ఏరియాస్ లో ఫామ్స్ ఇంటింటికీ తిరిగి ఇస్తున్నా.. హైదరాబాద్ లో మాత్రం అది జరగడం లేదు.

Advertisement

ఇక ఫామ్స్ డిజిటలైజేషన్ కూడా చాలా లేట్ అవుతోంది. అందుకు BLOలపై ఉన్న ఒత్తిడి ప్రధాన కారణం. అదనపు సిబ్బందిని నియమిస్తే తమపై భారం తగ్గుతుందని BLOలే చెబుతున్నారు. ఇక స్టిక్కరింగ్ వేసే బాధ్యతను అంగన్ వాడీ, ఆశ వర్కర్లకు అప్పజెప్పారు. వారికి పూర్తి అవగాహన లేకపోవడంతో అక్కడా సమస్యలే వస్తున్నాయి.

గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే.. అంతా పర్ ఫెక్ట్ అని ఎలా అంటారు? పోనీ.. ప్రతి పనిలో చిన్న చిన్న లోపాలు ఉండడం సహజమే అంటారేమో.. కాని సర్ ప్రక్రియ వేరు సర్.. ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టే ఓటు హక్కు ఉంచాలో..తీసేయాలో నిర్ణయించే డిసైడింగ్ ఫ్యాక్టర్. అందుకే ఇదంతా.

Advertisement

Also Read: చమురు నిలిపివేత.. రాబోయే ఆర్థిక భూతం.. మన జేబులకు ఎంత చిల్లు పడనుంది?

Related News

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సొంత డబ్బు ఇక బ్యాంకులో!

కాంట్రాక్టర్ యమ సేఫ్ ప్లాన్.. ఏసీబీకి చిక్కిన అధికారి.. ఎలా చిక్కారంటే..?

సునీల్ గవాస్కర్ నుంచి నేను నేర్చుకున్నది ఇదే.. అజహరుద్దీన్ సక్సెస్ మంత్ర!

గవర్నర్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బిగ్ అప్డేట్.. సూచనలు చేస్తానని హమీ!

ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపిక కాలేదా? మీ డబ్బు ఇలా వాపస్

మట్టి గణపయ్యను ఇంటికి తీసుకెళ్లండి.. హెచ్ఎండీఏ బంపర్ ఆఫర్

రేవంత్ vs కేసీఆర్.. సామాజిక స్పృహపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

మీ అయ్య జాగీరా.. మా MLCలను సస్పెండ్ చేస్తావా? కేటీఆర్ ఫైర్

Big Stories

Advertisement
×