HHVM:సాధారణంగా ఏదైనా ఒక సినిమా విడుదలవుతోంది అంటే ఆ సినిమాలో నటీనటులు దాదాపుగా ప్రమోషన్స్ లో పాల్గొంటారు. ఇక పెద్దపెద్ద హీరోల సినిమాలకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో కీలక పాత్రలు పోషించిన సెలబ్రిటీలను మొదలుకొని.. ఐటమ్ సాంగ్ చేసిన హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరు ప్రమోషన్స్ చేస్తారు. అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దాదాపు రెండేళ్ల తర్వాత చేస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ (Niddhi Agerwal), ఈ సినిమాను నిర్మించిన ఏఎం రత్నం (AM Ratnam) పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టారు. వీరిద్దరికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు.
ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టిన అనసూయ, బాబీ డియోల్..
ముఖ్యంగా పలు టీవీ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన.. సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు
దీనికి తోడు ప్రెస్ మీట్ , ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఈ సినిమాలో అనసూయ(Anasuya), బాబీ డియోల్ (Bobby Deol), సత్యరాజ్(Sathyaraj ), సునీల్(Sunil ) ఇలా ఎంతోమంది భారీతారాగణం భాగమైంది. అయితే ఇందులో చాలామంది ఈ ప్రమోషన్స్ కి హాజరు కావడం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బాబీ డియోల్, స్పెషల్ సాంగ్ చేసిన అనసూయ ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం ప్రశ్నార్ధకంగా మారింది. సాధారణంగా అనసూయ చిన్న సినిమాకి కూడా ప్రమోట్ చేయడానికి వస్తుంది. అలాంటిది ఇంత పెద్ద సినిమా.. అందులోనూ ఏపీ డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ కాబోతుండడంతో అలాంటి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం ఏంటి? అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బాబీ డియోల్ అందుకే ప్రమోషన్స్ కి దూరం అయ్యారా?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ కి బాలీవుడ్ యాక్టర్, నటి అనసూయ రాకపోవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. మొదట బాబీ డియోల్ విషయానికి వస్తే.. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమైనప్పుడు.. బాబీ డియోల్ కోసం డైరెక్టర్ క్రిష్ నేరేట్ చేసిన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. అయితే ఇప్పుడు ఆ పాత్రను డైరెక్టర్ జ్యోతి కృష్ణ పూర్తిగా మార్చేశారట. ఈ కారణంగా ఆయన ఏమైనా అలిగి ఉండొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే బాబీ ప్రమోషన్స్ కి పాల్గొనలేదేమో అంటూ నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆ కోపం వల్లే అనసూయ ప్రమోషన్స్ చేయలేదా..?
ఇక అనసూయ విషయానికి వస్తే.. అనసూయ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం.. అటు పొలిటికల్ కెరియర్ కు ఇబ్బంది కాకూడదని.. ఐటమ్ సాంగ్స్ లోని చాలా సన్నివేశాలను కట్ చేశారు. ఆ కట్ చేసిన దాంట్లో అనసూయ కూడా ఎగిరిపోయింది అని.. అందుకే ఆమె కూడా అలిగి, ఈ సినిమా ప్రమోషన్స్ కి రాలేదు అని సమాచారం. మొత్తానికైతే ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు వీరిద్దరూ ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి రాకపోవడంతో ఇలా పలు రకాల అనుమానాలు తెరపైకి వచ్చాయి.