Satya Dev: ముందుగా చిన్న చిన్న పాత్రలలో కనిపించిన సత్యదేవ్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతి లక్ష్మి సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ సినిమా తర్వాత కొన్ని కీలక పాత్రలలో మాత్రమే కనిపిస్తూ హీరోగా కూడా సినిమాలు చేశాడు. గోపి గణేష్ దర్శకత్వంలో వచ్చిన బ్లఫ్ మాస్టర్ సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది.
అయితే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినా కూడా ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పటికే ఆ సినిమా విషయంలో బాధపడుతూ ఉంటాడు సత్యదేవ్. ఆ సినిమాలు సత్యదేవ్ క్యారెక్టర్జేషన్ చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు గోపి గణేష్. ఇక తర్వాత సత్యదేవ్ నటించిన సినిమాలేవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ను సాధించలేకపోయాయి.
అవకాశం వదులుకోలేదు
ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే విలన్ గా కూడా నటించాడు సత్య. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాలో ఏకంగా చిరంజీవికి ప్రతి నాయకుడు పాత్రను పోషించాడు సత్య. సత్య మొదట ఈ విలన్ రోల్ గురించి ఆలోచిస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తనను పిలిచి సత్య నువ్వు రోల్ చేయడం వలన ఇంకో పదిమందికి తెలుస్తావు. దానివల్ల నీకు అవకాశాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి పక్కన అవకాశం వస్తే ఎవరు కాదనుకుంటారు అని ఇంటెన్షన్ తో ఆ సినిమాను కూడా చేసేసాడు సత్యదేవ్. ఆ సినిమా సత్యదేవ్ కి మంచి పేరుని తీసుకొచ్చింది.
పాత్ర బావుంది గుర్తింపు కరువైంది
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శివ అనే పాత్రలో కనిపించాడు సత్యదేవ్. విజయ్ దేవరకొండకు అన్నగా నటించాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు సత్యదేవ్ పాత్ర ఇంపార్టెన్స్ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సీన్స్ లో సత్యదేవ్ హీరోలా అనిపించాడు. ప్రతి సీన్ నట విశ్వరూపం చూపించాడు. కొన్ని సీన్స్ లో విజయ్ ను డామినేట్ చేశాడని కూడా చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్ లో సత్యదేవ్ కి దొరికిన పాత్రలలో ఇది అసలైన పాత్ర అని చెప్పొచ్చు. కానీ ఈ పాత్ర గురించి బయట ఎక్కువగా ఎవరూ మాట్లాడటం లేదు. సినిమాకి ఇంకొంచెం రీచ్ వచ్చిన తర్వాత అయినా సత్యదేవ్ కి కాంప్లిమెంట్స్ వస్తాయేమో చూడాలి.
Also Read: Satya Dev: సత్యదేవ్ కి అసలైన కం బ్యాక్, కానీ క్రెడిట్ గల్లంతు